Kane Williamson: వదిలేస్తున్న విషయం ముందే చెప్పారు: కేన్‌ విలియమ్సన్‌

హైదరాబాద్‌ జట్టు తనను వదిలేస్తున్న విషయం ముందే తెలుసునని కేన్‌ విలియమ్సన్‌ తెలిపాడు. ఈ ప్రకటన తనను ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదన్నాడు. 

Published : 17 Nov 2022 00:13 IST

దిల్లీ: జట్టు కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ను హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ వద్దనుకున్న విషయం తెలిసిందే. గతేడాది రూ.14 కోట్లు వెచ్చించి మరి కేన్‌ను కెప్టెన్‌గా హైదరాబాద్‌ జట్టు కొనసాగించింది. అయితే గత సీజన్‌లో దారుణ వైఫల్యం కారణంగా జట్టు యాజమాన్యం కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక తాజా నిర్ణయంపై కేన్స్‌ స్పందించాడు. ఈ ప్రకటన తనను ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదన్నాడు. జట్టు వదిలేస్తున్న విషయం తనకు ముందే తెలుసునన్నాడు. 

‘‘ప్రపంచంలో ఇంకా ఎన్నో పోటీలు ఉన్నాయి. అయితే ఆటగాళ్లకు భారత టీ20 లీగ్‌లో ఆడటం గొప్ప అనుభూతినిస్తుంది. క్రికెటర్లు వేరు వేరు జట్లకు ఆడటం చూస్తూనే ఉన్నాం. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎంతో క్రికెట్‌ మిగిలివుంది. అన్ని ఫార్మాట్లలో ఆడటం నాకెంతో ఇష్టం. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించినప్పుడు నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే జట్టు ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే నాతో చర్చించింది. హైదరాబాద్‌కు ఆడటం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇక్కడ నాకు చాలా గొప్ప అనుభూతులున్నాయి.’’అంటూ కేన్స్‌ వివరించాడు. 2023 టీ20 లీగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంఛైజీలు చాలా మంది కీలక ఆటగాళ్లను పక్కన పెట్టేశాయి. కేన్‌తో పాటుగా నికోలస్‌ పూరన్‌, సుచిత్, ప్రియం గార్గ్, సమర్థ్‌, షెపర్డ్‌ వంటి ఆటగాళ్లను సైతం హైదరాబాద్‌ వదులుకుంది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని