Kapil Dev: బౌలింగ్‌ చేయనప్పుడు ఆల్‌రౌండర్‌ అనొచ్చా?

రెగ్యులర్‌గా బౌలింగ్‌ చేయలేకపోతున్న హార్దిక్‌ పాండ్యను ఆల్‌రౌండర్‌ అని ఎలా పిలుస్తామని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ ప్రశ్నించాడు. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో పాండ్య కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే బంతి

Updated : 27 Nov 2021 07:14 IST

కోల్‌కతా: రెగ్యులర్‌గా బౌలింగ్‌ చేయలేకపోతున్న హార్దిక్‌ పాండ్యను ఆల్‌రౌండర్‌ అని ఎలా పిలుస్తామని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ ప్రశ్నించాడు. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో పాండ్య కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే బంతి పట్టుకున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలంటే హార్దిక్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండూ చేయాలి. అతడు క్రమం తప్పకుండా బౌలింగ్‌ చేయట్లేదు.. మరి అతడిని ఆల్‌రౌండర్‌ అని ఎలా పిలుస్తాం? గాయం నుంచి కోలుకున్నాక అతడితో బౌలింగ్‌ చేయించాలి. బ్యాటర్‌గా జట్టుకు అతడెంతో కీలకం. బౌలర్‌గా అతడెన్నో మ్యాచ్‌లు ఆడాలి.. సత్తా చాటాలి. అప్పుడు మాత్రమే ఆల్‌రౌండర్‌గా పిలుచుకోవచ్చు’’ అని కపిల్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని