Pant: ఎవరూ ఒంటరిగా డ్రైవ్‌ చేయొద్దు.. అప్పటి నుంచి నన్ను బండి ముట్టనీయలేదు: కపిల్‌

కొత్త సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులకు సర్‌ప్రైజ్‌ ఇద్దామని భావించిన రిషభ్ పంత్‌ (Rishabh Pant) రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిషభ్‌పంత్‌తో సహా ఆటగాళ్లకు క్రికెట్‌ దిగ్గజం కపిల్ దేవ్‌ (Kapil Dev) కీలక సూచనలు చేశాడు.

Updated : 02 Jan 2023 15:12 IST

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్‌ఇండియా యువ బ్యాటర్ రిషభ్‌ పంత్ (Rishabh pant) దెహ్రాదూన్ ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్నాడు. ఇన్ఫెక్షన్‌ రాకుండా పంత్‌ను ప్రైవేట్ వార్డుకు తరలించారు. పంత్ ఆరోగ్యం మెరుగవ్వాలని ఆకాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ (kapil dev) కీలక సూచనలు చేశాడు. క్రికెటర్లు ఎవరూ ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లొద్దని సూచించాడు. 

‘‘అద్భుతమైన కార్లు మీ దగ్గర ఉన్నాయి. హై స్పీడ్‌తో దూసుకెళ్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్‌ పెట్టుకొనే స్థోమత ఉంది. అందుకే ఎప్పుడూ ఒంటరిగా డ్రైవింగ్‌ చేయొద్దు. ఇలాంటివి కొందరికి అలవాటుగా ఉంటాయి. లేకపోతే అభిరుచితో డ్రైవింగ్‌ చేస్తుంటారు. వయసురీత్యా సహజమే కానీ బాధ్యతలను కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి. మీరే మీ గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’

‘‘నేను యుక్త వయస్సులో.. క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో నాకూ బైక్‌ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి మా సోదరుడు నన్ను బండిని ముట్టుకోనీయలేదు. పంత్‌ను సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడేసినందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పాల్సిందే’’ అని కపిల్‌ వెల్లడించాడు. శుక్రవారం వేకువజామున  దిల్లీ నుంచి సొంత ఊరికి వెళ్తున్న సమయంలో పంత్ కారుకు ప్రమాదం జరిగింది. తన కుటుంబ సభ్యులకు సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఎవరికీ చెప్పకుండా పంత్ బయల్దేరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని