Virat Kohli: పెద్ద ఆటగాడు చాలా కాలంగా సెంచరీ చేయకపోవడం బాధగా ఉంది: కపిల్‌దేవ్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ బాది రెండున్నరేళ్లు దాటింది. అతడు చివరిగా 2010 నవంబర్‌ 22న బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శతకం బాదాడు. తర్వాత ఒక్కసారి

Published : 24 Jun 2022 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ బాది రెండున్నరేళ్లు దాటింది. అతడు చివరిగా 2010 నవంబర్‌ 22న బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శతకం బాదాడు. తర్వాత ఒక్కసారి కూడా మూడంకెల స్కోరును అందుకోలేదు. కోహ్లీ పేలవ ఫామ్‌పై భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు సెంచరీ లేకుండా చాలా కాలం గడపడం బాధగా ఉందని కపిల్‌ దేవ్‌ అన్నారు. ఒక ఆటగాడి ప్రదర్శన సరైన స్థాయిలో లేకుంటే మాజీ ఆటగాడిగా దానిని ప్రశ్నించే హక్కు తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. 

‘ఇంత పెద్ద ఆటగాడు (Virat Kohli) చాలా కాలంగా సెంచరీ చేయకపోవడం బాధగా ఉంది. అతను మాకు హీరోలాంటివాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెందూల్కర్, సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో పోల్చగలిగే ఆటగాడిని మనం చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఇంత గొప్ప పేరు తెచ్చుకున్న కోహ్లీ.. సెంచరీ కోసం ఇన్నాళ్లు తీసుకోవడం చాలా బాధాకరం. అతను రెండేళ్లుగా సెంచరీ చేయకపోవడంతో అతని అభిమానులతోపాటు మేము నిరాశలో ఉన్నాం. నేను కోహ్లీ అంత క్రికెట్ ఆడలేదు. కొన్నిసార్లు మీరు తగినంత క్రికెట్ ఆడటం లేదు. కానీ, విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పరుగులు చేయకపోతే, ఎక్కడో ఏదో తప్పు జరిగిందనుకుంటారు. అభిమానులు మీ ఆటతీరును మాత్రమే చూస్తారు. అది సరిగ్గా లేకుంటే వారు మౌనంగా ఉంటారని ఆశించవద్దు. అందుకే మీ బ్యాట్, ప్రదర్శన మాత్రమే మాట్లాడాలి’  అని కపిల్ ముగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని