Kapil Dev: హార్దిక్‌ను ఆల్‌రౌండర్‌గా పిలవొచ్చా..? నాకైతే వారిద్దరి ఆటంటే ఇష్టం: కపిల్
బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యను ఆల్‌రౌండర్‌గా పరిగణించవచ్చా? అని భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...
ఇంటర్నెట్ డెస్క్: బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యను ఆల్‌రౌండర్‌గా పరిగణించవచ్చా? అని భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశ్నించారు. వైట్‌బాల్ క్రికెట్లో కీలకంగా మారతాడని భావించిన పాండ్య ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో కేవలం రెండు మ్యాచుల్లోనే బౌలింగ్ చేశాడు. టీమ్ఇండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అంతకుముందు జరిగిన ఐపీఎల్‌లోనూ అసలు బౌలింగ్ చేయలేకపోయాడు. మరో వైపు బ్యాటింగ్‌లో కూడా పెద్దగా రాణించిందీ లేదు. ఈ క్రమంలో పాండ్య ఫిట్‌నెస్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో పాండ్య పాత్రపై కపిల్ స్పందించాడు.
‘‘ఎవరైనా క్రికెటర్‌ను ఆల్‌రౌండర్‌గా పిలవాలంటే బౌలింగ్, బ్యాటింగ్ చేయగలగాలి. అయితే పాండ్య బౌలింగ్ చేయడం లేదు కాబట్టి అతడిని ఆల్‌రౌండర్ అని పిలుస్తామా? గాయం నుంచి కోలుకున్న పాండ్యను మొదట బౌలింగ్ చేయనివ్వండి. టీమ్ఇండియాకు పాండ్య చాలా ముఖ్యమైన బ్యాటర్. అలానే ఎక్కువ మ్యాచుల్లో బౌలింగ్ చేయాలి. ఇటు బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రదర్శన చేస్తే అప్పుడు ఆల్‌రౌండర్‌గా పిలవొచ్చు’’ అని కపిల్ పేర్కొన్నాడు. తన ఫేవరేట్ ఆల్‌రౌండర్లు ఎవరని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇద్దరు పేర్లను చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తనకిష్టమైన ఆల్‌రౌండర్లని తెలిపాడు. అయితే జడేజా బ్యాటింగ్‌లో మెరుగుపడ్డాడని, బౌలింగ్‌లో కాస్త వెనుకబాటుకు గురైనట్లు అనిపిస్తోందని వివరించాడు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసేవాడు, ఇప్పుడు సూపర్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే ప్రతిసారి అతడు టీమ్ఇండియాకు అవసరమయ్యే ఆటగాడని వివరించాడు.
భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికను ఈ మాజీ సారథి ప్రశంసించాడు. అపార అనుభవమున్న క్రికెటర్‌గా కంటే కూడా ద్రవిడ్ కోచ్‌గా విజయవంతమవుతాడని విశ్లేషించాడు. కివీస్‌తో టీ20 సిరీస్ నుంచి రాహుల్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్ వరకు పదవిలో ఉంటాడు. ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన కపిల్ ‘‘వ్యక్తిగతంగా ద్రవిడ్ చాలా మంచి వ్యక్తి. ఇటు క్రికెటర్‌గానూ అనుభవజ్ఞుడు. క్రికెటర్‌గా కంటే కోచ్‌గా ఇంకా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే క్రికెట్లో అతని కంటే మెరుగ్గా ఎవరూ రాణించలేదు. అయితే ఒక్క సిరీస్‌కే అతడి సామర్థ్యాన్ని జడ్జ్ చేయకూడదు. అతడి పదవీకాలంలో చాలా చేస్తాడు. జస్ట్ మనమంతా సానుకూల దృక్పథంతో ఉండాలి’’ అని కపిల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్‌నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ ఒకటి. లఖ్‌నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్‌గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్‌కింగ్స్‌కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్‌కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్‌కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్‌లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.