Kapil Dev: కొత్త బాధ్యతల్లోకి వరల్డ్‌ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్‌ దేవ్..

భారత్‌కు తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను అందించిన కపిల్ దేవ్‌ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.

Published : 26 Jun 2024 15:53 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సరికొత్త బాధ్యతల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (PGTI) కొత్త అధ్యక్షడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హెచ్‌ఆర్‌ శ్రీనివాసన్ స్థానంలో కపిల్‌ దేవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘‘పీజీటీఐ ప్రెసిడెంట్ కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. గత కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేస్తున్నా. ఇది ప్లేయర్లకు మద్దతుగా నిలిచే సంఘం. చాలా ఏళ్లుగా నేనూ గోల్ఫ్‌ ఆడుతున్నా. తప్పకుండా నావంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. ఇంకాస్త అదనంగా నా స్నేహితులతో గోల్ఫ్‌ ఆడే అవకాశం వచ్చిందనుకుంటున్నా’’ అని కపిల్ ఓ ప్రకటనలో తెలిపారు. 


ఒలింపిక్స్‌కు హాకీ జట్టు ప్రకటన

పారిస్ ఒలింపిక్స్‌లో తలపడేందుకు హాకీ జట్టు సిద్ధమవుతోంది. తాజాగా జట్టును హాకీ సంఘం ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ సింగ్‌ నాయకత్వంలో జట్టు తలపడనుంది. ఐదుగురు అరంగేట్రం చేయనున్నట్లు భారత హాకీ సంఘం వెల్లడించింది. పూల్‌-బిలో బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌ గ్రూప్‌లో భారత్‌ ఆడనుంది. 

జట్టు ఇదే: శ్రీజేష్ పరట్టు రవీంద్రన్, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదస్, హర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, సంజయ్, రాజ్‌కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్‌దీప్ సింంగ్‌, గుర్జత్ సింగ్‌, నీలాకాంత్ శర్మ, జగ్‌రాజ్ సింగ్, కృష్ణన్ బహదూర్ పాఠక్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని