Kapil Dev: వన్డే, టెస్టు ఫార్మాట్లను ఐసీసీ కాపాడాలి: కపిల్‌దేవ్‌

క్రికెట్‌ కూడా ఐరోపాలో ఫుట్‌బాల్‌ వలే మారుతోందని భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక టి20 లీగ్‌ల్లో వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 16 Aug 2022 13:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ కూడా ఐరోపాలో ఫుట్‌బాల్‌ వలే మారుతోందని భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక టి20 లీగ్‌ల్లో వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లను కాపాడేందుకు ఐసీసీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ ఆంగ్ల పత్రికతో కపిల్‌ మాట్లాడుతూ.. ‘‘ ఐరోపాలో ఫుట్‌బాల్‌ వలే క్రికెట్‌ కూడా తయారవుతోంది. వారు ప్రతి దేశంతో ఆడరు. కేవలం నాలుగేళ్లకు ఒకసారి (ప్రపంచకప్‌లో) మాత్రమే ఆడతారు. ఇదే మార్గంలో ఇప్పుడు మనం వెళ్లబోతున్నాం. కేవలం వరల్డ్‌ కప్‌లో ఆడి మిగిలిన సమయంలో క్లబ్‌లకు (టి20 ఫ్రాంఛైజ్‌లు)కు ఆడుతుంటాము. ఐసీసీ కేవలం టి 20 క్రికెట్‌నే కాకుండా.. వన్డే, టెస్ట్‌ క్రికెట్‌ను బతికించడానికి తగినంత సమయం కేటాయించాలి’’ అని పేర్కొన్నారు.

ఇప్పటికే కిక్కిరిసిన షెడ్యూల్‌తో ఉన్న క్రికెట్‌ క్యాలెండర్‌ను.. భవిష్యత్తులో పుట్టుకొచ్చే టి20 లీగ్స్‌ మరింత ఒత్తిడికి గురి చేయనున్నాయి. వచ్చే ఏడాది నుంచి యూఏఈ, దక్షిణాఫ్రికాల్లో కొత్త లీగ్‌లు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఐసీసీ క్యాలెండర్‌లో భారత్‌లోని లీగ్‌ క్రికెట్‌కు మరింత సౌలభ్యం కల్పించనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు కూడా తమ దేశీయ  ఫ్రాంఛైజ్‌ లీగ్‌ల కోసం ప్రత్యేక స్లాట్లను కేటాయించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ సభ్యదేశాల బోర్డులు ద్వైపాక్షిక, దేశీయ సిరీస్‌లు ఆటగాళ్లకు భారం కాకుండా షెడ్యూల్స్‌ను నిర్వహించేలా చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ నిర్వహణ ఐసీసీకి అత్యంత ముఖ్యమైన బాధ్యత అని కపిల్‌ దేవ్‌ గుర్తు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని