PinkBall Test: భారత్‌ - శ్రీలంక పింక్‌బాల్‌ టెస్టు.. 100 శాతం ప్రేక్షకులకు అనుమతి

భారత్‌ - శ్రీలంక జట్ల మధ్య శనివారం నుంచి ప్రారంభమయ్యే పింక్‌బాల్‌ టెస్టుకు సంబంధించి కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది...

Published : 11 Mar 2022 10:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ - శ్రీలంక జట్ల మధ్య శనివారం నుంచి ప్రారంభమయ్యే పింక్‌బాల్‌ టెస్టుకు సంబంధించి కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండో టెస్టుకు వంద శాతం మంది ప్రేక్షకులను అనుమతించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కరోనా కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ మ్యాచ్‌కు మంచి డిమాండ్‌ ఉందని, దీంతో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అనుమతించేందుకు సంతోషంగా ఉన్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు గతవారం జరిగిన తొలి టెస్టుకు సంబంధించి తొలుత పంజాబ్‌ క్రికెట్‌ సంఘం నిర్వాహకులు ప్రేక్షకులను అనుమతించేందుకు నిరాకరించారు. అయితే, అది కోహ్లీకి వందో టెస్టు అయిన నేపథ్యంలో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చివరికి బీసీసీఐ చొరవతో 50 శాతం ఆక్యుపెన్సీతో గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఇప్పుడు బెంగళూరు వేదికగా జరిగే రెండో టెస్టుకు నిర్వాహకులు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని