Rohit Sharma: విజయవంతం కావాలంటే ప్రతి ఆటగాడిపై దృష్టి పెట్టాల్సిందే : రోహిత్‌ శర్మ

టీమిండియా విజయవంతమైన జట్టుగా నిలవాలంటే ప్రతి ఆటగాడిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనని టీ20 తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. జట్టుకు అదనపు బౌలర్‌ అవసరం చాలా..

Published : 17 Nov 2021 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా విజయవంతమైన జట్టుగా నిలవాలంటే ప్రతి ఆటగాడిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనని టీ20 తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. జట్టుకు అదనపు బౌలర్‌ అవసరం చాలా ఉందన్నాడు. వచ్చే ఏడాదే మరో టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో నాణ్యమైన బౌలర్‌ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. 

‘టీమిండియా విజయవంతం కావాలంటే జట్టులోని ప్రతి ఒక్కరిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాదే మరో టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో.. బౌలింగ్‌ చేయగల నాణ్యమైన ఆల్‌ రౌండర్‌ని తయారు చేసుకోవాలి. ఒక్క ఆల్‌రౌండర్‌నే నమ్ముకుంటే విజయం సాధించలేం. జట్టు అవసరాలను బట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ రాణించేలా తీర్చి దిద్దాలి. అప్పుడే మనం విజయవంతం అవుతాం’ అని రోహిత్‌ శర్మ అన్నాడు. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) ఆల్‌రౌండర్‌ వెంకేటేశ్‌ అయ్యర్‌ని తుది జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్య అంచనాలను అందుకోలేకపోవడంతో జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని