Pant - Dravid : రిషభ్‌ పంత్ షాట్లు కొడుతుంటే ఒక్కోసారి మా హార్ట్‌బీట్‌ పెరుగుతోంది: ద్రవిడ్

ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైనప్పటికీ యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్ మాత్రం తన ఆటతీరుతో అభిమానులను అలరించాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ...

Published : 07 Jul 2022 02:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైనప్పటికీ యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్ మాత్రం తన ఆటతీరుతో అభిమానులను అలరించాడు. కఠిన పరిస్థితుల్లోనూ క్లిష్టమైన షాట్లను కొడుతూ సెంచరీ సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకం చేశాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా కోచ్ రాహుల్‌ ద్రవిడ్ వికెట్‌ కీపర్ రిషభ్‌ పంత్‌ను కొనియాడాడు. రిషభ్‌ తనదైన శైలిలోనే రిస్కీ షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడని, తనను అలానే ఆడనివ్వాలని పేర్కొన్నాడు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వెనకడుగు వేయడని, అందుకే ప్రతి ఒక్కరూ పంత్ శైలిని అంగీకరించక తప్పదని స్పష్టం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ మ్యాచ్‌ ఫలితాలను మార్చేయగల సత్తా రిషభ్‌ సొంతమని ద్రవిడ్ చెప్పాడు. 

ఒక్కోసారి రిషభ్‌ పంత్ ఆడే షాట్లకు తమ హార్ట్‌బీట్‌ అమాంతం పెరిగిపోతుందని ద్రవిడ్‌ వ్యాఖ్యానించాడు. అయితే తన రిస్కీ షాట్లను ఆడుతున్న రిషభ్‌కు జట్టంతా పూర్తి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశాడు. ‘‘టెస్టు క్రికెట్‌లో చాలా బాగా ఆడుతున్నాడు. నిజం చెప్పాలంటే తన షాట్లతో ఒక్కోసారి మా గుండె చప్పుళ్లను పెంచేస్తుంటాడు. అయితే వాటిని అలవాటు చేసుకోవడం నేర్చుకున్నాం. క్లిష్టమైన సమయాల్లో ఇలాంటి షాట్‌ ఆడకుండా ఉంటే బాగుంటుందని మనం అనుకున్నప్పుడే రిషభ్‌ రిస్కీ షాట్లను ఆడేస్తాడు. అయితే వాటిని అంగీకరించక తప్పదు. టెస్టు మ్యాచుల్లోనూ తన ఆటతీరుతో ఫలితాన్ని మార్చేయగలడు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలోనూ మనం చూశాం’’ అని ద్రవిడ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని