SA20 League: కెమెరా ముందు ఇలా చేయడం కంటే.. బంతిని ఎదుర్కోవడం చాలా ఈజీ: కేశవ్‌

భారత టీ20 లీగ్‌ ప్రభావం క్రికెట్‌పై చాలానే ఉంది. ఆ లీగ్‌ సక్సెస్ కావడంతో ఇతర దేశాల్లోనూ టోర్నీలు ఊపందుకొన్నాయి. వచ్చే ఏడాది నుంచి దక్షిణాఫ్రికాలోనూ ఇలాంటి టీ20 లీగ్‌ ప్రారంభం కానుంది.

Published : 26 Nov 2022 23:30 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్‌ విజయవంతం కావడంతో దక్షిణాఫ్రికాలోనూ లీగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. ముంబయి, చెన్నై వంటి ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోనూ జట్లను కొనుగోలు చేశాయి. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుంచి టీ20 లీగ్‌ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహరాజ్‌తో చేసిన వీడియోను సీఎస్‌ఏ టీ20 లీగ్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. దీంతో ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. 

కేవలం 20 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోలో కేశవ్‌ మహరాజ్‌ ఓ మాస్క్‌ను పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అది సెట్‌ చేయడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ‘‘ ఇలా చేయడం కంటే.. క్రికెట్‌ బంతిని ఎదుర్కోవడం చాలా సులువేమో’’ అని అంటున్న వీడియోను సీఎస్‌ఏ టీ20 లీగ్‌ షేర్‌ చేసింది. దానికి మరొక ఆటగాడు షంసి స్పందించాడు. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, జొహెన్స్‌బర్గ్‌ సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్‌ కేప్‌టౌన్, పార్ల్‌ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ పాల్గొనే ఈ లీగ్‌కు కమిషనర్‌గా గ్రేమీ స్మిత్‌ వ్యవహరిస్తాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని