Published : 29 Jan 2022 02:03 IST

IPL 2022:నేను ఐపీఎల్‌ ఆడితే భారీ ధర పలుకుతా..: పీటర్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అతడు తాజాగా ఐపీఎల్‌లో తిరిగి ఆడటంపై స్పందించి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఒమన్‌లో లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో మాజీ క్రికెటర్లు మూడు జట్లుగా విడిపోయి క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం అల్‌ అమెరాత్‌ మైదానంలో వరల్డ్‌ జెయింట్స్‌, ఆసియా లైయన్స్‌ జట్లు తలపడ్డాయి. అక్కడ ఆసియా జట్టు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. వరల్డ్‌ జెయింట్స్‌ టీమ్‌ గెలుపొందింది. ఈ జట్టు తరఫున ఆడుతున్న పీటర్సన్‌ (86; 38 బంతుల్లో 7x6, 9x4) దంచికొట్టాడు. దీంతో అతడి స్ట్రైక్‌రేట్‌ 226.32గా నమోదైంది. ఈ క్రమంలోనే ఆ జట్టు సునాయాస విజయం సాధించింది.

మ్యాచ్‌ అనంతరం తన బ్యాటింగ్‌ వీడియోను పీటర్సన్ ట్విటర్‌లో పోస్టు చేయగా.. భారత క్రికెటర్‌ గోస్వామి స్పందించాడు. ఈ ఇన్నింగ్స్‌ చూసి మళ్లీ ఐపీఎల్‌లో ఆడాలంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీనికి ప్రతిస్పందించిన ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌..‘నేను ఐపీఎల్‌ ఆడితే భారీ ధర పలుకుతా. అలాగే ఆ టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది. అది ప్రస్తుత ఆటగాళ్లకు అవమానభారంగా మిగిలిపోతుంది’ అని నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో పీటర్సన్‌ విరోచితంగా బ్యాటింగ్‌ చేసినా చివరికి స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, అప్పటికే ఆ జట్టు 10.4 ఓవర్లలో 128 పరుగులు చేసి విజయానికి చేరువైంది. తర్వాత ఐర్లాండ్‌కు చెందిన కెవిన్‌ ఓబ్రియన్‌ 24 బంతుల్లో 31 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్