Kieron Pollard : కీరన్‌ పొలార్డ్‌.. టీ20ల్లో అరుదైన ఘనత

వెస్డిండీస్‌ క్రికెట్‌లో ఠక్కున గుర్తుకొచ్చే క్రికెటర్లు క్రిస్‌ గేల్‌, కీరన్ పొలార్డ్‌.. వీరిద్దరూ భారత టీ20 లీగ్‌లోనూ ప్రాతినిధ్యం వహించడం.. భారీ షాట్లు...

Published : 09 Aug 2022 21:39 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్డిండీస్‌ క్రికెట్‌లో ఠక్కున గుర్తుకొచ్చే క్రికెటర్లు క్రిస్‌ గేల్‌, కీరన్ పొలార్డ్‌.. వీరిద్దరూ భారత టీ20 లీగ్‌లోనూ ప్రాతినిధ్యం వహించడం.. భారీ షాట్లు కొట్టగల ప్రతిభావంతులు కావడంతో అందరికీ చేరువయ్యారు. ఈ క్రమంలో వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్‌ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏకంగా 600 టీ20 మ్యాచ్‌లను ఆడిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. పొలార్డ్‌ ఇప్పుడేమీ విండీస్‌ జట్టులో లేడు కదా.. మరి ఎలా సాధించాడని  అనుకుంటున్నారా..? ఈ మాజీ సారథి అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమే వీడ్కోలు పలికాడు. దేశీయ క్రికెట్‌ లీగుల్లో ఇంకా ఆడుతున్నాడు. ఈ క్రమంలో ‘హండ్రెడ్ టోర్నమెంట్’లో లండన్ స్పిరిట్స్ జట్టుకు పొలార్డ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌ పొలార్డ్‌కు 600వ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. ఇందులో అంతర్జాతీయంగా 101 టీ20లు ఉన్నాయి. 

ఇప్పటివరకు పొలార్డ్‌ ఆడిన 600 టీ20ల్లో  151.22 స్ట్రైక్‌రేట్‌తో 11,723 పరుగులను సాధించాడు. 31.34 యావరేజ్‌తో ఆడిన పొలార్డ్‌ కేవలం ఒకే శతకం, 56 అర్ధశతకాలను నమోదు చేశాడు. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 104. మొత్తం 783 సిక్సర్లు, 738 ఫోర్లను బాదాడు. ఇక 8.21 ఎకానమీతో 309 వికెట్లను తీయడం విశేషం. బౌలింగ్‌ అత్యుత్తమ ప్రదర్శన 4/15. ఇందులో ఏడుసార్లు నాలుగు వికెట్ల కంటే ఎక్కువసార్లు తీశాడు. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, భారత టీ20 లీగ్‌లో ముంబయి జట్టు, బిగ్‌బాష్‌ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌,  మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్, ఢాకా గ్లాడియేటర్స్, ఢాకా డైనమైట్స్‌, కరాచీ కింగ్స్‌, ముల్తాన్ సుల్తాన్స్‌, పెషావర్ జాల్మీ, ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ తదితర దేశీయ లీగుల్లో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రపంచ క్రికెట్‌లో పొలార్డ్‌ తర్వాత అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్లలో డ్వేన్ బ్రావో (543), షోయబ్‌ మాలిక్ (472), క్రిస్‌ గేల్ (463), రవి బొపారా (426) ఉన్నారు. పొలార్డ్‌ 600 టీ20లు ఆడటంపై టీమ్‌ఇండియా స్పీడ్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. అద్భుతమైన మైలురాయిని సాధించిన పొలార్డ్‌కు శుభాకాంక్షలు అంటూ.. ట్వీట్ చేశాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని