Updated : 09 Aug 2022 19:46 IST

Team India: ‘అర్ష్‌దీప్‌ రూపంలో టీమ్‌ఇండియాకు అసలైన లెఫ్టార్మ్‌ బౌలర్‌ దొరికాడు’

ఇంటర్నెట్‌డెస్క్‌: యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ రూపంలో టీమ్‌ఇండియాకు అసలుసిసలైన లెఫ్టార్మ్‌ పేసర్‌ దొరికాడని మాజీ వికెట్‌ కీపర్‌, ఛైర్మన్‌ ఆఫ్‌ సెలెక్టర్స్‌ కిరణ్‌ మోరే అభిప్రాయపడ్డారు. తాజాగా ఆసియాకప్‌ టోర్నీకి టీమ్‌ఇండియాను ఎంపిక చేసిన జట్టులో అర్ష్‌దీప్‌ను ఎంపిక చేసిన నేపథ్యంలో ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ తర్వాత టీమ్‌ఇండియాకు సరైన ఎడమచేతి వాటం బౌలర్‌ లేడనే విషయం తెలిసిందే. అయితే, తర్వాత కొంత మంది లెఫ్టార్మ్‌ పేసర్లు వచ్చినా జట్టులో నిలదొక్కుకుపోలేదని అన్నారు. దీంతో అర్ష్‌దీప్‌ ఇప్పుడు ఆ వెలితిని భర్తీ చేశాడన్నారు.

‘అర్ష్‌దీప్‌ను ఆసియాకప్‌ టోర్నీకి ఎంపిక చేయడం పట్ల నేనెంతగానో సంతోషిస్తున్నా. అతడు కొంతకాలంగా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. తొలుత భారత టీ20 లీగ్‌లో తర్వాత వెస్టిండీస్‌ పర్యటనలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేశాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా సరైన లెఫ్టార్మ్‌ పేసర్‌ కోసం వెతుకుతుండగా అతడు దొరికాడు’ అని కిరణ్‌ మోరే చెప్పుకొచ్చారు. మరోవైపు రెండేళ్లకుపైగా ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న విరాట్‌ కోహ్లీకి రాబోయే ఆసియాకప్‌ ప్రత్యేకమని, అందులో కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే ఫామ్‌ కోల్పోయి చాలా కాలమైందని గుర్తు చేశారు. ఆసియాకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టు సమతూకంగా ఉందని, ఇతర బ్యాట్స్‌మెన్‌, ఆల్‌రౌండర్లు కూడా బాగా ఆడుతున్నారని మెచ్చుకున్నారు. ఈ జట్టుతో తాను సంతోషంగా ఉన్నట్లు మాజీ క్రికెటర్‌ పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని