KL Rahul : కేఎల్‌ రాహుల్ అవసరమా..?

ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కేఎల్ రాహుల్‌ తర్వాత కొవిడ్‌ బారిన పడి విషయం తెలిసిందే. ఆసియా కప్‌నకు కూడా..

Published : 05 Aug 2022 14:26 IST

కొత్త చర్చకు తెర తీసిన కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్

 

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కేఎల్ రాహుల్‌ తర్వాత కొవిడ్‌ బారిన పడి విషయం తెలిసిందే. ఆసియా కప్‌నకు కూడా అందుబాటులో ఉంటాడో లేదో అనుమానమే. అయితే టీమ్‌ఇండియాలో ఇప్పటికే స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్ వంటి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ అవసరమా..? అనే చర్చ కొత్తగా మొదలైంది. కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా పక్కకు తప్పుకోవడం వల్ల యువ ఆటగాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు అవకాశం వచ్చిందని కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్ స్టైరిస్‌ అభిప్రాయపడ్డాడు. 

‘‘ఎవరైనా సరే తాము జట్టు నుంచి బయటకు పోకుండా ఉండాలి. ఇతర ప్లేయర్లు ఎవరూ తమ స్థానంలో రాకూడదని ఆటగాళ్లు భావిస్తుంటారు. అయితే భారత్‌లో మంచి సంప్రదాయం కొనసాగుతోంది. ఇతర ఆటగాళ్లకు అవకాశం కల్పించినా పెద్దగా పట్టించుకోరు. ఓ ఆటగాడిగా నేను కూడా నా స్థానంలో మరొక ఆటగాడికి అవకాశం ఇవ్వాలని కోరుకోను. ఇప్పుడు కేఎల్ రాహుల్‌ గాయం కారణంగా అందుబాటులో ఉండటం లేదు. అందువల్లే సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ఆటగాడికి అవకాశం వచ్చింది. దానిని అందిపుచ్చుకుంటున్నాడు. దీంతో సెలెక్టర్లకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేఎల్‌ రాహుల్‌ అవసరమా..? వెనక్కి వచ్చినా ఫామ్‌లోనే ఉంటాడా..? ఇప్పటికే అతడు చాలా రోజుల నుంచి క్రికెట్‌ ఆడటంలేదు’’ అని స్టైరిస్ తెలిపాడు. అయితే రెండు వారాల్లోగా అందుబాటులో ఉంటానని ఇప్పటికే  కేఎల్ రాహుల్‌ ట్విటర్ వేదికగా స్పందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని