KKR vs RCB: చెలరేగిన కోల్‌కతా బౌలర్లు..ఆర్సీబీ 92 ఆలౌట్
అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో ఆర్సీబీ 18.6 ఓవర్లకు ఆలౌటైంది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్(22) టాప్ స్కోరర్
ఇంటర్నెట్ డెస్క్: అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో ఆర్సీబీ 18.6 ఓవర్లకు ఆలౌటైంది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్(22) టాప్ స్కోరర్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు రెండో ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 1.4 ఓవర్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ(5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.తర్వాత వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్(16)తో కలిసి దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో చివరి బంతికి పడిక్కల్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది.
రసెల్ వేసిన తొమ్మిదో ఓవర్లో భరత్(16), డివిలియర్స్(0) ఔటయ్యారు. ఈ క్రమంలో పది ఓవర్లకు ఆర్సీబీ 54/4తో నిలిచింది. వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్లో మాక్స్వెల్(10), హసరంగ(0) పెవిలియన్ చేరారు. కైల్ జేమీసన్(4), సచిన్ బేబీ(7) కూడా నిరాశపర్చారు.హర్షల్ పటేల్(12) రెండు ఫోర్లు బాది ఫెర్గూసన్ వేసిన 16.3 ఓవర్‌కు క్లీన్ బౌల్డయ్యాడు.సిరాజ్(8)ని రసెల్ ఔట్ చేశాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్ మూడు వికెట్లతో రాణించారు.ఫెర్గూసన్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్‌కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్‌పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్‌రైజర్స్ పొట్టి లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్‌గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్‌కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్‌ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో