KKR vs RCB: బెంగళూరుపై కోల్‌కతా సునాయాస విజయం

ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ శుభారంభం చేసింది.రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఓపెనర్లు శుభమన్ గిల్‌ (48),వెంకటేశ్‌ అయ్యర్ (41)రాణించడంతో ఆర్‌సీబీ

Updated : 20 Sep 2021 22:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ శుభారంభం చేసింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు శుభమన్ గిల్‌ (48), వెంకటేశ్‌ అయ్యర్ (41)రాణించడంతో ఆర్‌సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 9.6 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోకి వచ్చింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా 18.6 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు ఆటగాళ్లలో ఓపెనర్ దేవదత్‌ పడిక్కల్(22) టాప్ స్కోరర్. ఆర్‌సీబీకి రెండో ఓవర్‌లోనే గట్టి షాక్‌ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 1.4 ఓవర్‌కు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ(5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీకర్‌ భరత్‌(16)తో కలిసి దేవదత్‌ పడిక్కల్‌ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఫెర్గూసన్‌ వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతికి పడిక్కల్‌ దినేశ్‌ కార్తీక్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత ఆర్‌సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. రసెల్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో భరత్(16), డివిలియర్స్‌(0) ఔటయ్యారు. ఈ క్రమంలో పది ఓవర్లకు ఆర్‌సీబీ 54/4తో నిలిచింది. వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్‌లో మాక్స్‌వెల్(10), హసరంగ(0) పెవిలియన్‌ చేరారు. కైల్‌ జేమీసన్‌(4), సచిన్‌ బేబీ(7) కూడా నిరాశపర్చారు.హర్షల్‌ పటేల్‌(12) రెండు ఫోర్లు బాది ఫెర్గూసన్‌ వేసిన 16.3 ఓవర్‌కు క్లీన్‌ బౌల్డయ్యాడు.సిరాజ్‌(8)ని రసెల్ ఔట్ చేశాడు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్ మూడు వికెట్లతో రాణించారు.ఫెర్గూసన్‌ రెండు, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక వికెట్‌ తీశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని