Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌

జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పునరాగమనం చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated : 11 Aug 2022 22:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా వరుస సిరీస్‌లతో బిజీగా ఉంటే.. స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం వివిధ కారణాలతో కీలక సిరీస్‌లకు దూరం అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జింబాబ్వే సిరీస్‌కూ రాహుల్‌ లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది. కానీ, తాజాగా రాహుల్‌ ఫిట్‌నెస్‌ టెస్టులో అర్హత సాధించడంతో జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో అవకాశం కల్పిస్తున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌, జింబాబ్వేల మధ్య ఆగస్టు 18న తొలి వన్డే, ఆగస్టు 20న రెండో వన్డే, ఆగస్టు 22న మూడో వన్డే జరగనుండగా.. వీటికి కేఎల్‌ రాహుల్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించడం విశేషం. 

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు తొలుత శిఖర్‌ ధావన్‌కు జట్టు నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. అయితే, కేఎల్‌ రాహుల్‌ పునరాగమనం కావడంతో ధావన్‌ను వైస్‌ కెప్టెన్‌గా.. అతని స్థానంలో రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే జింబాబ్వేతో సిరీస్ ముగిసిన తర్వాత వచ్చే ఆసియా కప్‌లోనూ కేఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉంది. 

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శిఖర్ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్‌ ఠాకూర్, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చాహర్‌.

జింబాబ్వే జట్టు: రెగిస్‌ చకబ్వా (కెప్టెన్‌), ర్యాన్ బర్ల్‌, సికందర్‌ రజా, తనకా చివాండా, బ్రాడ్లీ ఎవన్స్‌, లుకే జాంగ్వే, క్లివ్‌ మదన్‌డే, వెస్లే మదివేర్‌, జాన్‌ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌, విక్టర్‌ నగర్వా, విక్టర్‌ నౌచీ, మిల్టన్‌ శుంబా, డొనాల్డో తిరిపానో.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని