RAHUL-ATHIYA: ప్రియసఖికి రాహుల్ స్పెషల్ విషెస్
క్రికెటర్లు, నటీమణులు ప్రేమలో పడటం కొత్తేమీ కాదు. మొన్నటివరకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట వార్తల్లో నిలిచేది. ఇప్పుడు క్రమంగా...
ఇంటర్నెట్ డెస్క్: క్రికెటర్లు, నటీమణులు ప్రేమలో పడటం కొత్తేమీ కాదు. మొన్నటివరకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట వార్తల్లో నిలిచేది. ఇప్పుడు క్రమంగా ఆ స్థానాన్ని బాలీవుడ్ నటి అతియా శెట్టి-కేఎల్ రాహుల్ జోడీ ఆక్రమిస్తున్నట్లుంది. అతియా శెట్టి మరోవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్త. కేఎల్ రాహుల్ టీ20 ప్రపంచకప్ కోసం యూఏఈలో ఉన్నాడు. ఇదే క్రమంలో అతియా శెట్టి కూడా దుబాయ్‌లోనే ఉంటుంది. నిన్న (శుక్రవారం) అతియా శెట్టి బర్త్‌డే. ప్రియసఖి పక్కన ఉండటం వల్లనో.. పుట్టిన రోజుకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడో కానీ స్కాట్లాండ్ మీద కేఎల్ రాహుల్ (50) విరుచుకుపడ్డాడు. టీమ్ఇండియా సునాయాసంగా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా తన ప్రేమను తెలియజేస్తూ అతియాకి రాహుల్ శుభాకాంక్షలు చెప్పాడు. హ్యాపీ బర్త్‌డే మై లవ్ అంటూ (లవ్ సింబల్) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను అందులో షేర్ చేశాడు. దీనికి అతియా శెట్టి కూడా రిప్లై ఇచ్చేసింది. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోను ఉంచుతూ ‘ఎంతో గొప్పగా ఉంది. నీ ప్రేమ, శుభాకాంక్షలకు ధన్యవాదాలు’ అంటూ సమాధానం ఇచ్చింది.
అతియా శెట్టి- కేఎల్ రాహుల్ రెండేళ్ల నుంచి డేటింగ్లో ఉన్నారు. తొలుత వారి అనుబంధం గురించి రూమర్లు వచ్చినా... థాయిలాండ్ హాలిడే ట్రిప్‌కు వెళ్లిన వారిద్దరి ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారిపోవడంతో.. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు అభిమానులు నిర్థారణకు వచ్చేశారు. సునీల్ శెట్టి-మనా శెట్టి కుమార్తె అతియా శెట్టి. 2015లో సూరజ్ పంచోలీతో ‘హీరో’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. అతియా శెట్టి చివరగా నటించిన చిత్రం ‘మోతిచూర్.. చక్నాచూర్’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు