IPL 2021: ‘ఆ ఇద్దరి కంటే రాహుల్‌లో గొప్ప శక్తి సామర్థ్యాలున్నాయి’: గౌతమ్‌ గంభీర్‌

గత గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ దంచికొట్టిన విషయం తెలిసిందే. తన విధ్వంసకర ఆటతో 42 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు ఆరు వికెట్ల..

Updated : 09 Oct 2021 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ దంచికొట్టిన విషయం తెలిసిందే. తన విధ్వంసకర ఆటతో 42 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. అయినా రన్‌రేట్ తక్కువగా ఉండటంతో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం రాహుల్ ఆటతీరుపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. అతడిలో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలను మించిన శక్తి సామర్థ్యాలున్నాయని ప్రశంసించాడు.

‘రాహుల్.. నీలో ఉన్న విధ్వంసకర ఆటగాడిని ఇన్నాళ్లు ప్రపంచానికి ఎందుకు పరిచయం చేయలేదు. ఇక కోల్పోవడానికి ఏం మిగల్లేదనుకున్న సమయంలో.. నీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్ని బయటకి తీశావు. నీ సత్తా ఏంటో చూపించావు. ఇవాళ నీ ఆటను చూసి ప్రపంచమే మురిసిపోతోంది. కోహ్లి, రోహిత్ శర్మల కంటే ఎక్కువగా నీ ఆటతీరు గురించే చర్చిస్తున్నారు. మిగతా మ్యాచుల్లో కూడా ఇలాగే ఆడి ఉంటే పంజాజ్‌ కింగ్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరి ఉండేది. బహుశా నాయకత్వ బాధ్యతల కారణంగా.. అన్ని మ్యాచుల్లో స్వేచ్ఛగా ఆడలేకపోవచ్చు. విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మల కంటే గొప్ప శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నీ షాట్లలో గొప్ప వైవిధ్యం ఉంది’ అని  గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన పంజాబ్‌ కింగ్స్‌ జట్టు.. ఆరు మ్యచుల్లో విజయం సాధించింది. 12 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో ఈ సీజన్‌ని ముగించింది. ఆ జట్టు కెప్టెన్‌ కేల్‌ రాహుల్‌ 13 మ్యాచుల్లో 623 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని