KL Rahul: కేఎల్ రాహుల్‌.. టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటే అలా చేయ్‌: ఆకాశ్ చోప్రా

ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ (T20 world cup)లో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)కు చోటు దక్కాలంటే రానున్న ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాలని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా (Akash chopra) సూచించాడు. 

Published : 22 Jan 2024 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ (T20 world cup)లో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)కు చోటు దక్కాలంటే రానున్న ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాలని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా (Akash chopra) సూచించాడు. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) తరఫున ఓపెనర్‌గా బ్యాటింగ్‌ చేస్తున్న రాహుల్‌కు భారత జట్టులో ఓపెనింగ్‌ చేసే అవకాశాలు రావట్లేదు. ప్రస్తుతం ఆ స్థానానికి చాలా మంది పోటీ పడుతున్నారు. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ ఓటమిపాలైన తర్వాత కెప్టెన్‌ రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించారు. టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్‌, కోహ్లీలను అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. రాహుల్‌కు మాత్రం మొండిచేయి చూపారు. 

టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆకాశ్‌ చోప్రా రాహుల్‌కు కీలక సూచన చేశాడు. ‘‘రాహుల్‌ వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు సంపాదించాలంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలి. ఇది ఎల్‌ఎస్‌జీకి కూడా ఇబ్బంది కలిగించే విషయమేమీ కాదు. మూడో స్థానంలో దీపక్‌ హుడా, ఆయుష్‌ బదోని, ప్రేరక్‌ మన్కడ్‌ లాంటి వాళ్లున్నారు. మినీ వేలంలో దేవదత్‌ పడిక్కల్‌ను సొంతం చేసుకున్నందున అతడు ఓపెనింగ్‌ చేయవచ్చు. నాలుగో స్థానం అనంతరం నికోలస్‌ పూరన్‌, స్టాయినిస్, కృనాల్‌ పాండ్య లాంటి ఆటగాళ్లతో మంచి బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉంది’’ అని చోప్రా వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు