KL Rahul: క్లాస్‌ ప్లేయరే అయినప్పటికీ.. కేఎల్‌ రాహుల్‌ ఆట తీరుపై మాజీ ఆటగాడి విశ్లేషణ

కేఎల్‌ రాహుల్‌(KL Rahul) ప్రదర్శనపై మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నాడని అన్నాడు.

Updated : 14 Jan 2023 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  శ్రీలంకతో రెండో వన్డే(IND Vs SL)లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు కేఎల్‌ రాహుల్(KL Rahul)‌. అయితే రాహుల్‌ బ్యాటింగ్‌ చేసిన ప్రతిసారి.. అతడి ప్రదర్శన పరిశీలనలో ఉంటుందని మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌(Wasim Jaffer) అన్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ఆటగాడు తుది జట్టులో లేని సమయంలో రాహుల్‌ ప్రదర్శన కీలకంగా మారుతుందని పేర్కొన్నాడు.

‘బ్యాట్‌తో మంచి ప్రదర్శన చేయని సమయంలో.. అందరూ వాళ్లవైపే వేలెత్తి చూపుతారు. రాహుల్‌ గత కొంతకాలంగా మంచి ఫామ్‌లో లేడు. ముఖ్యంగా సూర్యకుమార్‌ లాంటి ఆటగాళ్లు ప్లేయింగ్‌ XIలో లేనప్పుడు.. రాహుల్‌ ఆడే ప్రతి ఇన్నింగ్స్‌ను పరిశీలిస్తారు. రోడ్డు ప్రమాదం కారణంగా పంత్‌ ఆటకు దూరమయ్యాడు. మరోవైపు సంజు శాంసన్‌ తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో రాహుల్‌కు ప్రతి ఇన్నింగ్స్‌ చాలా క్లిష్టంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు’ అని జాఫర్‌ ఓ క్రీడా ఛానల్‌తో విశ్లేషించాడు.

రాహుల్‌ క్లాస్‌ ప్లేయరే అయినప్పటికీ.. పెద్ద టీమ్‌లపై సరిగ్గా రాణించలేకపోతున్నాడని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. ‘అతడు జట్టుకు కీలక పరుగులు అందించి ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది. ఇకపై రాహుల్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. అతడు క్లాస్‌ ప్లేయరే అయినప్పటికీ.. నిలకడలేమీ సమస్యగా మారింది. పెద్ద వేదికలపై.. అంచనాలకు తగ్గట్లు ఆడలేకపోతున్నాడు’ అని వసీం జాఫర్‌ పేర్కొన్నాడు.

రాహుల్‌ 64 పరుగులతో అజేయంగా నిలవడంతో శ్రీలంకతో రెండో వన్డేను గెలిచిన టీమ్‌ఇండియా.. సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో మ్యాచ్‌ తిరువనంతపురం వేదికగా ఆదివారం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని