Ayush Badoni : ఆయుష్ బదోని.. 360 డిగ్రీల ఆటగాడు: కేఎల్ రాహుల్

ఆయుష్ బదోని రూపంలో టీమ్‌ఇండియాకు మంచి బ్యాటర్‌ దొరికినట్లేనని...

Published : 01 Apr 2022 19:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆయుష్ బదోని రూపంలో టీమ్‌ఇండియాకు మంచి బ్యాటర్‌ దొరికినట్లేనని లఖ్‌నవూ సారథి కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. 360 డిగ్రీల్లో ఆడగలిగే సామర్థ్యం ఆయుష్ సొంతమని పేర్కొన్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం (54), చెన్నైపై భారీ లక్ష్య ఛేదనలోనూ ఆయుష్‌ (9 బంతుల్లో 19 పరుగులు: 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. ‘‘బదోనికి సంబంధించిన పలు వీడియోలను చూశా. మంచి షాట్లను ఆడటం చూసి ఉంటాం. అయితే ఆయుష్ కొన్ని అసాధారణమైన షాట్లను కొట్టాడు. 360 డిగ్రీల ఆటగాడు. భారత్‌కు దొరికిన మంచి ప్లేయర్‌. తెల్లబంతి క్రికెట్‌కు అసెట్‌గా మారతాడనేదాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలానే రవి బిష్ణోయ్‌ పోరాటస్ఫూర్తి ఉన్నవాడు’’ అని కేఎల్ రాహుల్ వివరించాడు.

బ్రావో ఓ ఛాంపియన్‌: మలింగ 

టీ20 లీగ్‌ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించిన చెన్నై బౌలర్‌ డ్వేన్‌ బ్రావోను లసిత్‌ మలింగ అభినందించాడు. మలింగ రికార్డునే బ్రావో అధిగమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా లసిత్‌ స్పందించాడు. ‘‘బ్రావో ఓ ఛాంపియన్‌. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన బ్రావోకు శుభాకాంక్షలు. ఇంకా సాధించాలి యంగ్ మ్యాన్‌’’ అని మలింగ పోస్ట్‌ చేశాడు. మలింగ 122 మ్యాచుల్లో 170 వికెట్లు తీయగా.. బ్రావో 153 మ్యాచుల్లో 171 వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం మలింగ రాజస్థాన్‌ జట్టు కోచింగ్‌ బృందంలో సభ్యుడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని