IND vs SA: ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతాం.! : కేఎల్ రాహుల్‌

దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ తెలిపాడు! ప్రస్తుతం భారత జట్టులో మిడిలార్డర్‌ స్థానం..

Published : 24 Dec 2021 22:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ తెలిపాడు. ప్రస్తుతం భారత జట్టులో మిడిలార్డర్‌ స్థానం కోసం పోటీ పెరిగిందని అన్నాడు.

‘విదేశీ పిచ్‌లపై ఏ జట్టైనా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. మేం కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తాం. అలా చేస్తేనే 20 వికెట్లు తీయడంతో పాటు సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించగలం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కూడా రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా సహా మొత్తం ఐదుగురు బౌలర్లతో టీమ్‌ఇండియా బరిలోకి దిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో కూడా ఇలాగే చేసింది. ప్రస్తుతం, భారత జట్టులో మిడిలార్డర్‌ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ ఆటగాడు అజింక్య రహానెతో పాటు హనుమ విహారి, శ్రేయస్‌ అయ్యర్‌ ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు. విదేశాల్లో అజింక్య రహానెకు మంచి రికార్డు ఉంది. గతంలో మెల్‌బోర్న్‌, లార్డ్స్‌ మైదానాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ నుంచి అతడికి పోటీ ఎదురవుతుంది. హనుమ విహారి కూడా ఇటీవల దక్షిణాఫ్రికా - ఏ జట్టుపై సత్తా చాటి పోటీలోకి వచ్చాడు’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.

అయితే, సీనియర్‌ బ్యాటర్లు కోహ్లీ, అజింక్య రహానె, పుజారాలు ఫామ్‌లేమితో సతమవుతున్నారు. మరోవైపు గాయం కారణంగా రోహిత్‌ శర్మ కూడా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే బ్యాటింగ్‌పై ప్రభావం పడుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నలుగురు బౌలర్లతో ఆడితే బౌలర్లు త్వరగా అలసటకు గురవడమే కాకుండా వారిపై తీవ్ర ఒత్తిడి పడుతుందని భావిస్తున్నారు. అందుకే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి పరుగులు చేయగల ఆటగాడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. డిసెంబరు 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని