T20 World Cup: టీమిండియాకు కేఎల్ రాహుల్‌ గొప్ప ఆస్తి : కపిల్ దేవ్‌

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి అర్ధ శతకంతో ఆకట్టుకున్న కేఎల్‌ రాహుల్‌ టీమిండియాకు గొప్ప ఆస్తి అని మాజీ క్రికెటర్‌ కపిల్ దేవ్‌ ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు భారత జట్టులో కీలక..

Published : 21 Oct 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి అర్ధ శతకంతో ఆకట్టుకున్న కేఎల్‌ రాహుల్‌ టీమిండియాకు గొప్ప ఆస్తి అని మాజీ క్రికెటర్‌ కపిల్ దేవ్‌ ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు భారత జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడని పేర్కొన్నాడు. ‘నేను కేల్‌ రాహుల్ ఆటను ఆస్వాదిస్తాను. అతడు చాలా కాన్ఫిడెంట్‌తో షాట్లు ఆడుతాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో గొప్పగా రాణించిన రాహుల్ ఈ టీ20 ప్రపంచకప్‌లో కూడా అదే స్థాయిలో ఆడతాడని అనుకుంటున్నాను. భవిష్యత్తులో అతడు భారత జట్టుకు మరిన్ని సేవలందిస్తాడు’ అని కపిల్ దేవ్‌ పేర్కొన్నాడు.

‘రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాను సొంత గడ్డపైనే రెండుసార్లు ఓడించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. విదేశీ గడ్డపై సిరీస్‌లు గెలవడమంటే మామూలు విషయం కాదు. కానీ, టీమిండియా వరుసగా విజయాలు సాధిస్తోంది. కోచ్‌గా రవిశాస్త్రికి ఇదే చివరి టీ20 ప్రపంచకప్‌ కాబట్టి భారత్ ఈ సారి కూడా మెరుగ్గా రాణించి ఛాంపియన్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని ప్రశాంతమైన ఆటగాడు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ని నాలుగోసారి విజేతగా నిలిపాడు. ప్రస్తుతం అతడు మెంటార్‌గా వ్యవహరిస్తుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. చాలా రోజుల తర్వాత ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించడంతో యువ ఆటగాళ్లు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. తన అనుభవం, ఆలోచనలతో టీమిండియాను అతడు కచ్చితంగా ప్రభావితం చేయగలడు’ అని కపిల్‌ దేవ్‌ అన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని