
KL Rahul: వాహ్ రాహుల్..! గేల్, వార్నర్‌ను వెనక్కినెట్టి.. నాలుగో సారి 600
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ భారత టీ20 లీగ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో మొత్తం మీద నాలుగు సార్లు 600 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతరాత్రి బెంగళూరుతో తలపడిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాహుల్ (79; 58 బంతుల్లో 3x4, 5x6) ధనాధన్ బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓటమిపాలైనా అతడు తీవ్రంగా పోరాడాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో నాలుగో అర్ధ శతకం సాధించడం ద్వారా మొత్తం 616 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో వరుసగా మూడేళ్లు 600 కన్నా అధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఇంతకుముందు పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్ గతేడాది 2021 సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 626 పరుగులు చేశాడు. దీంతో ఆ సీజన్లో టాప్-3 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే 2020 సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు చేశాడు. అప్పుడు అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇక 2019లో 13 మ్యాచ్‌ల్లో 593 పరుగులు చేసి టాప్-2లో ఉన్నాడు. అంతకుముందు 2018 సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 659 పరుగులతో మూడో స్థానంతో సరిపెట్టుకొన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ 2011, 2012, 2013 సీజన్లలో వరుసగా మూడేళ్లు బెంగళూరు తరఫున 600కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ 2016, 2018, 2019 సీజన్లలో హైదరాబాద్ తరఫున అదే ఘనత సాధించాడు. దీంతో రాహుల్ ఈసారి వారిద్దర్నీ వెనక్కినెట్టి నాలుగో సారి 600కుపైగా పరుగులు సాధించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
-
Ap-top-news News
Raghurama: ఏపీలో మోదీ పర్యటన.. ఏ జాబితాలోనూ రఘురామ పేరు లేదు: డీఐజీ
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- అర్ధంతరంగా వెనుదిరిగిన రఘురామకృష్ణరాజు
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- Narendra Modi: డబుల్ ఇంజిన్ వస్తోంది
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్