KL Rahul: మిడిలార్డర్‌లో ఆడేందుకు సిద్ధం కావాలన్నారు: కేఎల్‌ రాహుల్‌

రానున్న వన్డే మ్యాచ్‌ల్లో తనను మిడిలార్డర్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలంటూ టీమ్‌మేనేజ్‌మెంట్‌ అడిగిందని కేఎల్‌ రాహుల్‌(KL Rahul) తెలిపాడు. 

Published : 06 Dec 2022 13:25 IST

దిల్లీ:  బంగ్లాదేశ్‌(Bangladesh)తో వన్డే సిరీస్‌కు రిషభ్‌ పంత్‌(Rishabh pant) దూరమైన విషయం తెలిసిందే. వైద్య సిబ్బంది సూచనల మేరకు అతడికి విశ్రాంతినిచ్చినట్టు బీసీసీఐ(BCCI) దీనిపై స్పష్టతనిచ్చింది. అయినప్పటికీ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రానున్న వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌(KL Rahul)కు మిడిలార్డర్‌, వికెట్‌ కీపర్‌ బాధ్యతలను అప్పగించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. ఈ విషయంపై రాహుల్‌ తాజాగా స్పందించాడు. 

‘‘వన్డేల్లో వికెట్‌ కీపర్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలంటూ టీమ్‌మేనేజ్‌మెంట్‌ నన్ను అడిగింది. మేం గత 8-9 నెలల్లో ఈ ఫార్మాట్‌లో ఎక్కువగా ఆడలేదు. కానీ, 2020-21 మధ్య నేను 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగాను. అందుకే ఈ పాత్ర కోసం టీమ్‌మేనేజ్‌మెంట్‌ నన్ను సిద్ధంగా ఉండాలని కోరి ఉంటుంది’’ అని తెలిపాడు.  పంత్ విషయంపై మాట్లాడుతూ.. ‘‘రిషభ్‌ పంత్‌ ఈ సిరీస్‌కు దూరం కానున్నాడని ప్రకటించిన రోజే నాకూ తెలిసింది. అతడి విశ్రాంతికి గల కారణాలపై బీసీసీఐ వైద్య సిబ్బందే సరైన సమాధానం చెప్పగల్గుతారు’’అని తెలిపాడు.

బంగ్లాతో తొలి వన్డేలో రాహుల్‌ 73 పరుగులు చేసినప్పటికీ.. మెహదీ హసన్‌ క్యాచ్‌ను వదిలేయడంతో టీమ్‌ఇండియా ఓటమి బాట పట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని