Asia Cup 2023: భారత జట్టులోకి రాహుల్, శ్రేయస్? హింట్ ఇచ్చిన ద్రవిడ్

ఆగస్టు 30 నుంచి ఆసియా కప్‌ (Asia Cup 2023) ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఎంపికయ్యే అవకాశముంది. 

Published : 15 Aug 2023 01:48 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ 2023 (Asia Cup) ప్రారంభంకానుంది. త్వరలోనే ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. గాయాలపాలై కొంతకాలంగా టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్న క్రికెటర్లు ఈ టోర్నీతో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ మేరకు భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హింట్ ఇచ్చాడు. విండీస్‌తో ఐదో టీ20 ముగిసిన అనంతరం ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఆసియా కప్‌నకు ముందు బెంగళూరులో క్యాంప్ ఉంటుందని పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు ఈ క్యాంప్‌లో ఆసియా కప్‌ కోసం సన్నద్ధం కావొచ్చన్నాడు.

‘‘గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వచ్చేందుకు మాకు కొంతమంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మేం వారికి (ఆసియా కప్‌లో) ఆడే అవకాశాలు ఇవ్వాలి. ఆసియా కప్ కోసం ఆగస్టు 23 నుంచి బెంగళూరులో మాకు వారంపాటు క్యాంప్ ఉంది. మేం వారిని జట్టులో స్థానం కల్పించవచ్చు ’’ అని ద్రవిడ్ వివరించాడు. శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్, జస్ప్రీత్‌ బుమ్రా గాయాలపాలై కొంత కాలంగా టీమ్‌ఇండియాకు దూరంగా ఉంటున్నారు. ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్‌తో ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌తో బుమ్రా పునరాగమనం చేయనునున్నాడు. శ్రేయస్, కేఎల్ రాహుల్ బెంగళూరులోని ఎన్‌సీఏ (NCA) లో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు