KL Rahul: కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20ల్లో కేఎల్ రాహుల్ కొత్త రికార్డు
ఇంటర్నెట్‌డెస్క్: లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్లో గొప్ప రికార్డు నమోదు చేశాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా పొట్టి ఫార్మాట్లో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. కోహ్లీ 184 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. రాహుల్ 166 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. అలాగే ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్ తొలి స్థానంలో ఉండగా బాబర్ అజామ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
గతరాత్రి లఖ్‌నవూ టీమ్ బెంగళూరుతో తలపడిన సందర్భంగా ఛేదనలో రాహుల్ (30; 24 బంతుల్లో 3x4, 1x6) ధాటిగా ఆడాడు. అయితే, హర్షల్ పటేల్ వేసిన 8వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్లో అతడు ఈ ఘనత సాధించాడు. ఇక టీమ్ఇండియా తరఫున శిఖర్ ధావన్ (214), సురేశ్ రైనా (217), రోహిత్ శర్మ (228) ఇన్నింగ్స్‌లలో 6 వేల పరుగులు పూర్తి చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లఖ్‌నవూ 163/8 స్కోరుకే పరిమితమైంది. దీంతో ఆ జట్టు 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022: రసవత్తర ఫైనల్ పోరు.. వెండితో సరిపెట్టుకున్న భారత్
-
General News
Parrot: ‘ఆ చిలుక నన్ను తెగ ఇబ్బంది పెడుతోంది’.. పోలీసులకు వృద్ధుడి ఫిర్యాదు
-
Sports News
World Chess: ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
-
India News
Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
-
World News
Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
- Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ ఫిర్యాదు ఏంటో తెలుసా..?
- INDw vs AUSw : కామన్వెల్త్ ఫైనల్.. ఆసీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు