IND vs ENG: ఈ టెస్టు సిరీస్‌లో రాహుల్‌ వికెట్‌కీపింగ్‌ చేయడు: ద్రవిడ్‌

    భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) వికెట్‌ కీపింగ్‌ చేయడని భారత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పేర్కొన్నాడు. దీంతో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Published : 23 Jan 2024 21:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ (IND vs ENG 2024) మధ్య జవనరి 25 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) వికెట్‌ కీపింగ్‌ చేయడని భారత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పేర్కొన్నాడు. దీంతో ధ్రువ్‌ జురెల్‌, కేఎస్‌ భరత్‌లో ఎవరిని వికెట్‌కీపర్‌గా ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ద్రవిడ్‌ మాట్లాడుతూ ‘‘రాహుల్‌ ఈ సిరీస్‌లో వికెట్‌ కీపింగ్‌ చేయడు. దీనిపై మాకు స్పష్టత ఉంది. అందుకే ఇద్దరు పూర్తి స్థాయి కీపర్లను ఎంపిక చేశాం. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో రాహుల్‌ తన కీపింగ్‌తో ఆకట్టుకున్నాడు. సిరీస్‌ను డ్రాగా ముగించడంలో సహాయపడ్డాడు. అయినా భారత్‌లో పిచ్‌ల స్వభావానికి తగినట్టు, స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే స్పెషలిస్టు కీపర్‌ అవసరం’’ అని పేర్కొన్నాడు.

రాహుల్‌ 92 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింటిలోనే వికెట్‌కీపింగ్‌ చేశాడు. రిషబ్‌ పంత్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎస్‌ భరత్‌ 91 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో 287 క్యాచ్‌లు, 33 స్టంపింగ్స్‌ చేసి ప్రశంసలు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. కానీ, అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌ లయన్స్‌తో జరిగిన తొలి అనధికార మ్యాచ్‌లో భరత్ సెంచరీ చేసి ఆ మ్యాచ్‌ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు, జురెల్‌ కొత్తగా జట్టులోకి వచ్చాడు. కానీ కేఎస్‌ భరత్‌ కీపర్‌గా ఎంపికయ్యే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని