KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. 15 ఏళ్ల చరిత్రలో అపూర్వం

లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ప్రస్తుతం జరుగుతోన్న భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు...

Published : 20 May 2022 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ప్రస్తుతం జరుగుతోన్న భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడు వరుసగా ఐదో సీజన్‌లోనూ 500 పైచిలుకు పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2008లో ఈ టోర్నీ ప్రారంభమవ్వగా ఎవ్వరూ ఇలా ఇన్నేళ్లు వరుసగా అన్ని పరుగులు సాధించలేదు. దీంతో రాహుల్‌ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో అతడు ఇప్పటికే 14 మ్యాచ్‌లు ఆడగా.. 135.26 స్ట్రైక్ రేట్‌తో 537 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉండటం విశేషం. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ 627 పరుగులతో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. కాగా, రాహుల్‌ గతరాత్రి కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో (68 నాటౌట్‌; 51 బంతుల్లో 3x4, 4x6) మరోసారి మెరిసిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (140 నాటౌట్‌; 70 బంతుల్లో 10x4, 10x6)తో కలిసి ఒక్క వికెట్‌ పడకుండానే ఇన్నింగ్స్‌ పూర్తిచేసి మరో మేటి రికార్డులో భాగమయ్యాడు.

* 2018లో 659
* 2019లో 593
* 2020లో 670 (ఆరెంజ్ క్యాప్)
* 2021లో 626
* 2022లో 537 * (ప్లేఆఫ్స్‌లో ఆడాల్సి ఉంది)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని