IPL 2021: కోహ్లి కచ్చితంగా గొప్ప నాయకుడే: హర్షల్ పటేల్‌

క్రికెట్లో ఎంతో మంది సారథులున్నారు, నాయకులున్నారు కానీ విరాట్‌ కోహ్లి మాత్రం కచ్చితంగా గొప్ప నాయకుడని రాయల్ ఛాలెంజర్స్‌ ఆటగాడు హర్షల్ పటేల్‌ అన్నాడు. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్..

Published : 13 Oct 2021 02:19 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ఎంతో మంది సారథులున్నారు.. నాయకులున్నారు గానీ విరాట్‌ కోహ్లి మాత్రం కచ్చితంగా గొప్ప నాయకుడని రాయల్ ఛాలెంజర్స్‌ ఆటగాడు హర్షల్ పటేల్‌ అన్నాడు. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌ ముగిసిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా కోహ్లికి ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం.

‘ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా తప్పుకుని ఉండొచ్చు. అయినా అతడో గొప్ప నాయకుడు. తమ ప్రణాళికలను అమలు చేయడానికి విరాట్‌ కోహ్లి బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. 2012 నుంచి అతడితో కలిసి ఆడుతున్నా. అతడి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నా. కోహ్లి కెప్టెన్సీ విషయానికొస్తే.. క్రికెట్లో ఎంతో మంది సారథులున్నారు. నాయకులున్నారు. అయితే, కోహ్లి మాత్రం గొప్ప నాయకుడు. అతడు కెప్టెన్‌గా తప్పుకొన్నంత మాత్రాన.. అతన్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. జట్టుకు అతడు అందించిన సేవలు అమూల్యమైనవి. కెరీర్‌పరంగా నా ఎదుగుదలకు కోహ్లి ఎంతో సహకరించాడు’ అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు.

2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న విరాట్‌ కోహ్లి.. 2013 నుంచి జట్టుకి సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 2016లో కోహ్లి నాయకత్వంలో బెంగళూరు ఫైనల్‌ వరకు వెళ్లగలిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని