Virat Kohli: కోహ్లి 4 స్థానాలు కిందికి
కెరీర్లో ఎన్నడూ లేనంత సాధారణ ఫామ్‌లో కొనసాగుతున్న విరాట్ కోహ్లి ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ కిందికి పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో విఫలమవడంతో ఈ ఫార్మాట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో
దుబాయ్: కెరీర్లో ఎన్నడూ లేనంత సాధారణ ఫామ్‌లో కొనసాగుతున్న విరాట్ కోహ్లి ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ కిందికి పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో విఫలమవడంతో ఈ ఫార్మాట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను నాలుగు స్థానాలు కోల్పోయి ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. టోర్నీలో మూడు అర్ధశతకాలతో రాణించిన మరో భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్.. మూడు స్థానాలు మెరుగుపర్చుకుని అయిదో స్థానానికి ఎగబాకాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో హసరంగ మొదటి స్థానంలో ఉన్నాడు. బుమ్రాకు 15వ ర్యాంకు లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా