ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన పంత్
సిడ్నీ టెస్టులో 131, 81 పరుగులతో సత్తాచాటిన ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (900) తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని రెండో స్థానంలో నిలిచాడు. పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లిన విరాట్...
ఇంటర్నెట్‌డెస్క్: భారత్×ఆస్ట్రేలియా మూడో టెస్టు ముగిసిన నేపథ్యంలో ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. సిడ్నీ టెస్టులో 131, 81 పరుగులతో సత్తాచాటిన ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (900) తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని రెండో స్థానంలో నిలిచాడు. పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లిన విరాట్ కోహ్లీ ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానంలో (870) ఉన్నాడు. మరోవైపు పాకిస్థాన్ సిరీస్‌లో పరుగుల వరద పారించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (919) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
సిడ్నీ టెస్టును డ్రాగా ముగించిన చెతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. రెండు అర్ధశతకాలు సాధించిన పుజారా ఎనిమిదో స్థానానికి చేరాడు. ఆసీస్ బౌలర్లను బెంబేలెత్తించిన పంత్ ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌లో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు సాధించిన పంత్ రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
బ్లాక్‌థాన్ వ్యూహంతో కంగారూల విజయానికి చెక్ పెట్టిన హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ కూడా ర్యాంక్‌లు మెరుగుపర్చుకున్నారు. విహారి 52వ స్థానంలో, అశ్విన్ 89వ స్థానంలో ఉన్నారు. కాగా, కెప్టెన్ అజింక్య రహానె ఏడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విషయానికి కొస్తే.. అశ్విన్, బుమ్రా టాప్-10లో ఉన్నారు. వీరిద్దరు వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో జడేజా ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్‌లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్‌రైడర్స్ కోచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు