Kohli or Suryakumar: కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఎవరు బెస్ట్?

టీ20 ప్రపంచకప్‌లోకి భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా సెమీస్‌లోనే వెనుదిరగడంతో భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఈ టోర్నీలో విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లు దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకోవడంతో టీమ్‌ఇండియా ఫ్యాన్స్‌ సంబరపడ్డారు.

Published : 18 Nov 2022 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లోకి భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా సెమీస్‌లోనే వెనుదిరగడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఈ టోర్నీలో విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లు దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకోవడంతో టీమ్‌ఇండియా ఫ్యాన్స్‌ సంబరపడ్డారు. కోహ్లీ 6 ఇన్నింగ్స్‌ల్లో 98.66 సగటుతో 296 పరుగులు చేయగా.. సూర్యకుమార్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 59.75 సగటుతో 239 పరుగులు బాదాడు. అయితే, వీరిద్దరిలో  'బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎవరిని  ఎంచుకుంటారని భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రాలను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా వారు ఇలా స్పందించారు. 

‘ఈ టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. టోర్నీ ముగింపు దశలో జోస్ బట్లర్ ఫామ్‌లోకి వచ్చాడు. అలెక్స్ హేల్స్ కూడా ప్రభావం చూపాడు. కానీ, విరాట్‌ కోహ్లీ నిలకడగా ఆడుతూ ప్రత్యేకంగా నిలిచాడు. చాలా మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా ఉన్నాడు.  అతడు పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో టోర్నీలో ఎలా ఆడబోతున్నాననే సంకేతాన్ని ఇచ్చాడు’- జహీర్ ఖాన్ 

‘నా దృష్టిలో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ‘బ్యాటర్ ఆఫ్‌ ది టోర్నీ’అవుతాడు. అత్యుత్తమ ప్రదర్శన విషయానికొస్తే.. శ్రీలంకపై సెంచరీ చేసిన గ్లెన్ ఫిలిప్స్ ను ఎంచుకుంటా’- వీరేంద్ర సెహ్వాగ్ 

‘ఉత్తమ బ్యాటర్‌ ఎవరంటే.. నేను సూర్యకుమార్ యాదవ్ అని చెబుతాను. అతడు భారత ఆటగాడు అయినందుకు మాత్రమే కాదు.. గత 1-2 సంవత్సరాలుగా సూర్య ఆటతీరును బట్టి చెబుతున్నా. నాలుగో స్థానంలో అటువంటి స్ట్రైక్‌రేట్‌తో నిలకడగా ఆడటం అంత సులభం కాదు. ఇక, అత్యుత్తమ ప్రదర్శన విషయానికొస్తే.. శ్రీలంకపై  ఫిలిప్స్ చేసిన సెంచరీ’- ఆశిష్ నెహ్రా  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని