రాహుల్‌ను వెనక్కి నెట్టేసిన కోహ్లీ

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత మెరుగయ్యాడు. ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 3 ర్యాంకులు మెరుగై 14వ స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో విరాట్‌ 52 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా...

Published : 25 Mar 2021 01:14 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత మెరుగయ్యాడు. ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 3 ర్యాంకులు మెరుగై 14వ స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో విరాట్‌ 52 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. రోహిత్‌తో కలిసి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ పోరులో హిట్‌మ్యాన్‌ 34 బంతుల్లో 64 పరుగులు చేశాడు. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచుల్లో విఫలమైన కేఎల్‌ రాహుల్‌ ఒక స్థానం దిగజారి ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు.

టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకు 26కు చేరుకున్నాడు. ఐదు స్థానాలు ఎగబాకాడు. అరంగేట్రంలోనే అదరగొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌ మరింత ముందంజ వేశారు.  ఇంగ్లాండ్‌ సిరీసులో 57, 32తో చెలరేగిన సూర్య కింద నుంచి 66, రిషభ్‌ 11 స్థానాలు ఎగబాకి 69లో నిలిచారు.

పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 21 స్థానాలు ఎగబాకి 24కు చేరుకున్నాడు. ఆఖరి టీ20లో అతడు 2/15తో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ పాండ్య 47 స్థానాలు మెరుగై 78కి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌ జట్టులో డేవిడ్‌ మలన్‌ యథావిధిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జోస్‌ బట్లర్‌ ఒక స్థానం మెరుగై 18, ఆదిల్‌ రషీద్‌ 1 స్థానం మెరుగై 4, ఆర్చర్‌ 12 స్థానాలు మెరుగై 22, మార్క్‌వుడ్‌ 12 స్థానాలు మెరుగై 27కు చేరువయ్యారు. వన్డేల్లో జానీ బెయిర్‌స్టో కెరీర్‌ అత్యుత్తమ ఏడో ర్యాంకు సాధించాడు. ఇయాన్‌ మోర్గాన్‌ 24లో నిలిచాడు. శిఖర్‌ ధావన్‌ 2 స్థానాలు మెరుగై 15, భువనేశ్వర్‌ 5 స్థానాలు మెరుగై 20కి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని