Covid-19 Awareness: కేకేఆర్‌ వినూత్న ప్రచారం

దేశంలో రెండో దశ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 3.50 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా 3,62,727 మంది వైరస్‌ బారినపడ్డారు.  

Published : 14 May 2021 01:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  దేశం కరోనాపై చేస్తున్న యుద్ధంలో తమ వంతు సహకారం అందించేందుకు సెలబ్రెటీలు, క్రికెటర్లు విరాళాలు ప్రకటిస్తున్నారు. మరికొంతమంది ఆక్సిజన్‌ ఉత్పత్తి పరికరాలను ఆస్పత్రులకు అందిస్తున్నారు. అంతేకాకుండా కరోనా సోకకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రజలు కొవిడ్ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గత కొన్ని రోజులుగా ట్విటర్‌ వేదికగా వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేస్తూ ‘మంచి ఆటగాళ్లు షాట్ ఆడే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు’, ‘కరోనా నీ దగ్గరకు గంటకు 150 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకొస్తోంది. జాగ్రత్తగా ఉండు’, ‘చేతులను తరచూ శుభ్రపరుచుకుంటూ కరోనాను ఔట్‌ చేద్దాం’ అంటూ క్రికెట్‌కు పరిభాషలో కరోనాపై అవగాహన కల్పిస్తోంది. దానికి సంబంధించిన చిత్రాలను ట్వీట్‌ చేస్తోంది. ఆ ట్వీట్‌లపై మీరు ఓ లుక్కేయండి!











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని