IPL 2021: హైదరాబాద్‌పై కోల్‌కతా ఘన విజయం

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ (57) అర్థ శతకంతో రాణించాడు.

Updated : 03 Oct 2021 23:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ (57: 51 బంతుల్లో 10x4) అర్ధ శతకంతో రాణించాడు. నితీశ్ రాణా (25) ఫర్వాలేదనిపించాడు. వెంకటేశ్ అయ్యర్‌ (8), రాహుల్ త్రిపాఠి (7) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆఖర్లో వచ్చిన దినేశ్‌ కార్తిక్ (18), ఇయాన్ మోర్గాన్ (2) జట్టుని విజయ తీరాలకు చేర్చారు. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. హైదరాబాద్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్ రెండు‌, రషీద్‌ ఖాన్‌, సిద్దార్థ్‌ కౌల్ తలో వికెట్‌ తీశారు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్‌ సమద్‌ (25), ప్రియమ్‌ గార్గ్‌ (21) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్‌ జట్టుకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. టిమ్‌ సౌథీ వేసిన రెండో బంతికే వృద్ధిమాన్ సాహా (0) ఎల్బీగా వెనుదిరిగాడు. జేసన్ రాయ్‌ (10), అభిషేక్‌ శర్మ (6), రషీద్‌ ఖాన్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. జేసన్‌ హోల్డర్ (2) నిరాశ పరిచాడు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ మావి తలో రెండు వికెట్లు, షకీబ్‌ అల్ హసన్‌ ఒక వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని