Dhoni: అప్పటి నుంచే ధోనీ నన్ను గుర్తుపెట్టుకొని పిలుస్తున్నాడు: కొండప్ప రాజ్

ధోనీకి తాను తొలిసారి బౌలింగ్‌ చేసినప్పుడు తనని చూడకుండా బౌలింగ్‌ చేయమని చెప్పాడని చెన్నై టీమ్‌ త్రోడౌన్‌ స్పెషలిస్టు కొండప్ప రాజ్‌ పలాని పేర్కొన్నాడు...

Published : 28 May 2022 02:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధోనీకి తాను తొలిసారి బౌలింగ్‌ చేసినప్పుడు తనని చూడకుండా బౌలింగ్‌ చేయమని చెప్పాడని చెన్నై టీమ్‌ త్రోడౌన్‌ స్పెషలిస్టు కొండప్ప రాజ్‌ పలాని పేర్కొన్నాడు. కొంతకాలంగా చెన్నై జట్టులో త్రో బౌలర్‌గా సేవలందిస్తున్న అతడు తాజాగా చెన్నై టీమ్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తాను తొలిసారి ధోనీని కలిసిన క్షణాలను, అప్పుడు అతడు తనతో చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. అప్పుడు మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పుడే మొదటిసారి కలిశానని అన్నాడు.

‘ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పుడే నేను తొలిసారి చూశాను. అప్పుడే మా క్యాంప్‌ మొదలైంది. ఆ శిబిరంలో నన్ను త్రో బౌలింగ్‌ చేస్తావా.. అని అడిగాడు. దాంతో నేను సరేనని బౌలింగ్‌ చేశా. తొలి రెండు బంతుల్ని వైడ్లుగా వేశా. తర్వాత మూడో బంతిని ఫుల్‌టాస్‌ విసిరాను. అప్పుడు ధోనీ నా దగ్గరకి వచ్చి ‘నన్ను చూడటం మానేసి బౌలింగ్‌ చెయ్‌’ అన్నాడు. నన్ను సహజసిద్ధంగా బౌలింగ్‌ చేయాలని చెప్పాడు. అప్పుడు అతడికి కావాల్సిన విధంగా బౌలింగ్‌ చేశా. చివరికి సంతృప్తి చెందిన మహీ తర్వాత నన్ను పేరు గుర్తుపెట్టుకొని మరీ పిలవడం మొదలెట్టాడు’ అని కొండప్ప రాజ్‌ పేర్కొన్నాడు. కాగా, చెన్నై 2020లో తొలిసారి ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టింది. ఇప్పుడు రెండోసారి అలాగే వెనుదిరిగింది. ఇక ఈ సీజన్‌లో ధోనీ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 232 పరుగులు చేశాడు. సగటు 33.14 ఉండగా స్ట్రైక్‌రేట్‌ 123.40గా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు