రెండో టెస్టు: అతడికి చోటిచ్చి తీరాల్సిందే

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. జట్టు కూర్పు కుదరకపోతే వాషింగ్టన్‌ స్థానంలో అక్షరకు చోటివ్వాలని అన్నాడు. చెపాక్‌లో తర్వాతి టెస్టులో టాస్‌కు ప్రాధాన్యం ఉండకపోవచ్చని వెల్లడించాడు....

Published : 11 Feb 2021 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. జట్టు కూర్పు కుదరకపోతే వాషింగ్టన్‌ స్థానంలో అక్షర్‌కు చోటివ్వాలని అన్నాడు. చెపాక్‌లో తర్వాతి టెస్టులో టాస్‌కు ప్రాధాన్యం ఉండకపోవచ్చని వెల్లడించాడు.

చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌కు గతేడాది నుంచి జట్టులో చోటు దక్కడం లేదు. జట్టు కూర్పు కుదురకపోవడం ఒక కారణమైతే.. ఫామ్‌ కోల్పోవడం మరో కారణం. ఆసీస్‌ పర్యటనకూ అతడిని ఎంపిక చేసినా తుది జట్టులో చోటివ్వలేదు. భారత్‌లోనైనా ఇస్తారేమోనని అంచనా వేశారు. అప్పటికే వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకోవడంతో ఆఫ్‌స్పిన్నర్‌ తరహా బౌలింగే కావడంతో చోటివ్వలేదని కోహ్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో షాబాజ్‌ నదీమ్‌, సుందర్‌ భారీగా పరుగులు ఇవ్వడం చేటు చేసింది.

‘తర్వాతి మ్యాచులో నదీమ్‌ బదులు కుల్‌దీప్‌ను ఆడించాలి. నా ఉద్దేశం ప్రకారం అతడు తొలి మ్యాచులోనూ ఆడాల్సింది. కానీ చోటివ్వలేదు. అది సరికాదు. ఇప్పటికైనా ఆడించాలి. రెండో టెస్టులో టాస్‌కు ప్రాధాన్యం లేని పిచ్‌ను రూపొందించొచ్చు. అంటే టాస్‌ ఓడిపోయినా మ్యాచు ఏదో ఒకవైపు సాగదు. బహుశా తొలిరోజు నుంచే బంతి టర్న్‌ అయ్యే పిచ్‌ను తయారు చేస్తుండొచ్చు. ఏదేమైనా భారత జట్టులో కుల్‌దీప్‌ ఉండాలి. కావాలంటే సుందర్‌ బదులు అక్షర్‌ను ఆడించండి. తొలి టెస్టులో అతడు 85*తో నిలిచినా నేనిదే మాట చెబుతాను. ఎందుకంటే మూడో టెస్టులో అతడిని ఆడించరు’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

ఇవీ చదవండి
ఓటమిపై సాకులొద్దు.. పునఃసమీక్షించండి
రూట్‌ పైపైకి.. కోహ్లీ కిందకు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని