Kuldeep Yadav: టెస్టుల్లో కుల్‌దీప్‌ యాదవ్‌ మూడోసారి ఐదు వికెట్లు.. నెటిజన్ల ప్రశంసలు

చాలా రోజుల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన కుల్‌దీప్‌ యాదవ్‌ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అదరగొడుతున్నాడు.  తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాను ఆలౌట్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 16 ఓవర్లపాటు బౌలింగ్‌ చేసిన కుల్‌దీప్‌ 40 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

Published : 16 Dec 2022 23:33 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: చాలా రోజుల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన కుల్‌దీప్‌ యాదవ్‌ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అదరగొడుతున్నాడు.  తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాను ఆలౌట్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 16 ఓవర్లపాటు బౌలింగ్‌ చేసిన కుల్‌దీప్‌ 40 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు మెయిడిన్‌ ఓవర్లు ఉండటం విశేషం.  ఈ చైనామన్‌ బౌలర్‌ టెస్టుల్లో ఐదు వికెట్ల ఘనత అందుకోవడం ఇది మూడోసారి. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్‌ యాదవ్ బ్యాట్‌తోనూ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో (40; 114 బంతుల్లో 5 ఫోర్లు) బాదాడు. దీంతో కుల్‌దీప్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రానున్న మ్యాచ్‌ల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని ఆశిస్తున్నారు. 

ఇక, మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 404 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ 150 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 61.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులకు డిక్లేర్డ్ చేసి 513 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ ముందుంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఇంకా  471 పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని