RR vs RCB: ఒకరిద్దరు కాదు.. అంతా అదే పని చేశారు: బ్యాటింగ్‌పై కుమార సంగక్కర
కోల్‌కతాపై చెలరేగిన రాజస్థాన్ (RR) బ్యాటర్లు.. కీలకమైన సమయంలో బెంగళూరు బౌలింగ్‌కు దాసోహమవడంపై కుమార సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోవడంపైనా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోర ఓటమిని చవిచూడటంపై రాజస్థాన్ రాయల్స్ (RR vs RCB) ప్రధాన కోచ్ కుమార సంగక్కర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ తీరును తూర్పారపట్టిన సంగక్కర.. బౌలింగ్ విభాగం చాలా కష్టపడిందని అభినందించాడు. బెంగళూరు బౌలర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ బ్యాటర్లు వికెట్లను సమర్పించారని సంగక్కర వ్యాఖ్యానించాడు. 172 పరుగుల లక్ష్య ఛేదన చేసే క్రమంలో రాజస్థాన్ 59 పరుగులకే కుప్పకూలింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన జైస్వాల్, బట్లర్ డకౌట్ కాగా.. కెప్టెన్ కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. షిమ్రోన్ హెట్మెయర్ (35) మాత్రమే కాస్త రాణించాడు. బెంగళూరు బౌలర్ పార్నెల్ మూడు కీలక వికెట్లు తీశాడు.
‘‘మా బ్యాటింగ్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. తొలుత బౌలింగ్‌లో బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేయగలిగాం.. కానీ, ఛేదనలో పూర్తిగా విఫలం కావడం బాధించింది. పవర్ ప్లేలోనే సగం వికెట్లను కోల్పోవడం జట్టు అవకాశాలను మరింత దెబ్బతీసింది. తొలి ఆరు ఓవర్లలోనే దూకుడుగా ఆడి మరిన్ని పరుగులు రాబట్టాలని ప్రయత్నించాం. కానీ, అది ఫలితం ఇవ్వలేదు. భాగస్వామ్యాలను నిర్మించాల్సిన తరుణంలో ఆ పని చేయలేకపోయాం. ఐదు వికెట్లు త్వరగా పడిపోవడంతో మ్యాచ్ మా నుంచి దూరమైంది. బెంగళూరు బౌలర్లు మా బ్యాటర్లను ఔట్ చేయలేదు. మావాళ్లే వికెట్లను సమర్పించుకున్నారు. క్రీజ్‌లో నిలదొక్కుకోవాల్సిన తరుణంలో భారీ షాట్లకు వెళ్లి పెవిలియన్‌కు చేరారు. ఏదో ఒకరిద్దరుకాకుండా.. బ్యాటింగ్ విభాగం మొత్తం ఇలాగే మారింది. మాకు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. దురదృష్టవశాత్తూ ఇతర జట్ల ఫలితాలు మాకు అనుకూలంగా లేవని చెప్పాలి. చివరి మ్యాచ్‌లో నాణ్యమైన క్రికెట్ ఆడి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని సంగక్కర వ్యాఖ్యానించాడు.
మరోసారి విరాట్ వైరల్ (Virat Kohli)
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి వైరల్‌గా మారాడు. ప్రత్యర్థి వికెట్లు పడినప్పుడు తన హావభావాలతో చెలరేగిపోయే విరాట్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లోనూ తన జట్టు అభిమానులను ఉత్సాహపరిచాడు. వ్యాన్ పార్నెల్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (4) అనుజ్ రావత్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కీలకమైన సంజూ వికెట్ దక్కడంతో విరాట్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఈ వీడియోను జియో సినిమా తన ట్విటర్‌లో షేర్ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం