IPL 2022: సంజూ శాంసన్‌ విషయంలో మరో ఆలోచన చేయలేదు: కుమార సంగక్కర

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. ఇందులో కెప్టెన్ సంజూ శాంసన్ (రూ.14 కోట్లు), ఇంగ్లాండ్‌ బ్యాటర్ జోస్ బట్లర్‌(రూ.10 కోట్లు), యువ క్రికెటర్‌ యశస్వీ  జైస్వాల్‌ (రూ.4 కోట్లు) ఉన్నారు.  ఈ ముగ్గురి ఆటగాళ్లను రిటెయిన్‌ చేసుకున్న విషయంపై

Published : 02 Dec 2021 20:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. ఇందులో కెప్టెన్ సంజూ శాంసన్ (రూ.14 కోట్లు), ఇంగ్లాండ్‌ బ్యాటర్ జోస్ బట్లర్‌(రూ.10 కోట్లు), యువ క్రికెటర్‌ యశస్వీ  జైస్వాల్‌ (రూ.4 కోట్లు) ఉన్నారు.  ఈ ముగ్గురి ఆటగాళ్లను రిటెయిన్‌ చేసుకున్న విషయంపై రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర మాట్లాడాడు. సంజూ  శాంసన్‌ని సామర్థ్యం తెలుసు కాబట్టి మరో ఆలోచన చేయకుండా అతడిని రిటెయిన్‌ చేసుకున్నామని సంగక్కర అన్నాడు. అతడు రాజస్థాన్‌ రాయల్స్‌కి  దీర్ఘకాలం నాయకుడిగా ఉంటాడని పేర్కొన్నాడు.

‘భారతదేశం, అమెరికాలోని మా భాగస్వాములందరి సహాకారంతో కొత్తగా ఏర్పడిన మా డేటా అనలిటిక్ బృందంతో కలిసి పని చేయడంలో మేము చాలా కష్టపడ్డాం. మరో ఆలోచన లేకుండా సంజూ శాంసన్‌ని  రిటెయిన్‌ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. అతడు అసాధారణమైన ఆటగాడు. శాంసన్‌ మా జట్టుకు దీర్ఘకాల నాయకుడిగా ఉండబోతున్నాడు. అతడు జట్టు విజయాల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నాడు. అతడు రాజస్థాన్‌ రాయల్స్‌కు అద్భుతమైన ఆస్తి. యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ని కూడా అంటిపెట్టుకున్నాం. గత ఐపీఎల్‌లో అతడు చాలా మంచి ప్రదర్శన కనబరిచాడు. అతడు ప్రతిభావంతుడు. ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకుంటాడు’ అని సంగక్కర అన్నాడు. 

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని