WTC Final: బాత్‌రూమ్‌లో దాక్కున్న జేమీసన్‌

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాడు కైల్‌ జేమీసన్‌. కోహ్లీసేనను అతడు రెండు ఇన్నింగ్సుల్లో బంతితో దెబ్బకొట్టాడు. అలాంటిది ఆరో రోజు ఆఖరి సెషన్లో కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే ఆందోళనతో బాత్‌రూమ్‌లో...

Published : 30 Jun 2021 01:13 IST

టీమ్‌ఇండియా అభిమానుల శబ్దాలతో ఆందోళన పడ్డాడట!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాడు కైల్‌ జేమీసన్‌. కోహ్లీసేనను అతడు రెండు ఇన్నింగ్సుల్లో బంతితో దెబ్బకొట్టాడు. అలాంటిది ఆరో రోజు ఆఖరి సెషన్లో కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే ఆందోళనతో బాత్‌రూమ్‌లో దాక్కున్నాడట! టీమ్‌ఇండియా అభిమానులు చేసే శబ్దాలే ఇందుకు కారణమని తెలిపాడు.

‘బహుశా నా కెరీర్లో క్రికెట్‌ వీక్షించడంలో కఠినమైన సమయం ఇదే కావొచ్చు. మేం లోపల కూర్చొని టీవీలో క్రికెట్‌ చూస్తున్నాం. మైదానానికి, ప్రత్యక్ష ప్రసారానికి మధ్య కొంత అంతరం ఉంటుంది. కానీ బంతి బంతికీ భారత అభిమానులు శబ్దాలు చేసేవారు. అప్పుడే వికెట్‌ పడ్డట్టు అరుపులు వినిపించేవి. తీరా చూస్తే బంతిని డిఫెండ్‌ చేయడం లేదా సింగిల్‌ తీయడం కనిపించేది’ అని జేమీసన్‌ అన్నాడు.

‘నిజంగా క్రికెట్‌ చూడటం నాకు కఠినంగానే అనిపించింది. ఆ శబ్దాలను తప్పించుకొనేందుకు నేను చాలాసార్లు బాత్‌రూమ్‌కు వెళ్లాను. ఎందుకంటే నాకు ఉత్కంఠంగా అనిపించేది. కానీ క్రీజులో కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ ఉండటం అదృష్టం. వారిద్దరూ గొప్ప బ్యాట్స్‌మెన్‌. ఆందోళనను అధిగమించి ప్రశాంతంగా పని ముగించారు’ అని జేమీసన్‌ తెలిపాడు.

కొవిడ్‌-19 వల్ల బయటకు వెళ్లి విజయ సంబరాలు జరుపుకోలేక పోయామని జేమీసన్‌ అన్నాడు. డ్రస్సింగ్‌ రూమ్‌లోనే వేడుకలు చేసుకున్నామని తెలిపాడు. రెండేళ్లుగా అందరం కలిసే సమయం గడపడంతో సాన్నిహిత్యం పెరిగిందని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని