Updated : 15 Jan 2021 11:45 IST

నటరాజన్‌కు రెండు వికెట్లు

గబ్బా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ నటరాజన్‌ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు తీశాడు. తొలుత జట్టు స్కోర్‌ 200 వద్ద మాథ్యూవేడ్‌(45; 87 బంతుల్లో 6x4)ను ఔట్‌ చేసిన అతడు కాసేపటికే మార్నస్‌ లబుషేన్‌(108; 204 బంతుల్లో 9x4)ను పెవిలియన్‌ పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 213 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం గ్రీన్‌, టిమ్‌పైన్‌ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా 67 ఓవర్లకు 213/5తో కొనసాగుతోంది. 

అంతకుముందు ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే డేవిడ్‌ వార్నర్‌(1) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన లబుషేన్‌.. స్మిత్‌(36)తో కలిసి మూడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఇక రెండో సెషన్‌లో స్మిత్‌ ఔటయ్యాక.. వేడ్‌(45; 87 బంతుల్లో 6x4)తో జోడీ కట్టి 113 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే సిరాజ్‌ వేసిన 63వ ఓవర్‌ చివరి బంతికి 4 పరుగులు చేసి లబుషేన్ టెస్టుల్లో 5వ‌ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 50 పరుగుల లోపే అతడు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రహానె ఒక క్యాచ్‌ వదలగా, రెండోసారి పుజారా స్లిప్‌లో అందుకోలేకపోయాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని