IND vs NZ: అతడి గురించి పెద్దగా చెప్పకపోవడం ఆశ్చర్యమేసింది: సంజయ్ మంజ్రేకర్

భారత్‌ - న్యూజిలాండ్‌ (IND vs NZ) జట్ల మధ్య వన్డే సిరీస్‌ ముగిసింది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించిన టీమ్‌ఇండియా (Team India) 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. 

Published : 26 Jan 2023 14:33 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ 2023 మెగా టోర్నీ సన్నద్ధతను ఘనంగా ప్రారంభించింది. ఇప్పటికే శ్రీలంకతో వన్డే సిరీస్‌ను నెగ్గిన టీమ్‌ఇండియా.. తాజాగా న్యూజిలాండ్‌పైనా మూడు వన్డేల సిరీస్‌నూ సొంతం చేసుకొంది. శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రాణించాడు. అలాగే సిరాజ్‌ కూడా రెండు మ్యాచుల్లో కీలకమైన వికెట్లు తీశాడు. మూడో వన్డే అనంతరం ఎవరూ కూడా స్టార్‌ పేసర్ మహమ్మద్‌ సిరాజ్‌ గురించి పెద్దగా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యానించాడు. నిలకడగా అద్భుతమైన బంతులను సంధించిన సిరాజ్‌ను మంజ్రేకర్‌ అభినందించాడు. 

‘‘ఆ మ్యాచ్‌, అనంతరం సిరాజ్‌ గురించి ప్రస్తావన చాలా తక్కువగా ఉంది. ఎవరూ కూడా పెద్దగా మాట్లాడలేదు అయితే నేను చూసిన నంబర్‌వన్‌ ఆటగాడు సిరాజ్‌ మాత్రమే. అతడి ఎదుగుదల కూడా అద్భుతంగా ఉంది. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. మంచి లయతో బంతులను విసురుతున్నాడు. వన్డేల్లోనే కాకుండా.. టీ20లు, టెస్టుల్లోనూ రాణిస్తున్నాడు’’ 

‘‘ఇక బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ద్విశతకం, శతకం సాధించాడు. కానీ, కఠినమైన ప్రత్యర్థితో ఆడేటప్పుడు.. భారీగా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో బౌలింగ్‌ చేయడం కూడా కష్టమే. అయితే, భారత్‌కు సిరాజ్‌ దొరికాడు. టీమ్‌ఇండియాకు అవసరమైనప్పుడు సిరాజ్‌ వికెట్లను తీసి రాణించాడు’’ అని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని