
India Open 2022: ప్రపంచ విజేతలకు షాకిచ్చిన భారత ఆటగాళ్లు
దిల్లీ: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టోర్నమెంట్లో భాగంగా జరిగే ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ద్వయం మెరిసింది. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్స్ అయిన మహ్మద్ అహ్సన్-హెండ్రా సెటియావాన్ (ఇండోనేషియా) జోడిపై వారు అద్భుత విజయం సాధించారు. మొత్తం 42 నిమిషాల పాటు సాగిన ఆటలో 21-16, 26-24 తేడాతో సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి విజేతగా నిలిచింది.
మరోవైపు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌లో యువ ఆటగాడు లక్ష్యసేన్ ఔరా అనిపించాడు. సింగిల్స్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూ (సింగపూర్)కు అతడు షాకిచ్చాడు. లోహ్ కీన్ యూపై వరుస గేముల్లో 24-22, 21-17 తేడాతో లక్ష్యసేన్ టైటిల్ విజేత నిలిచాడు. ఇక సెమీ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశే మిగిలింది. థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా చేతిలో సింధు 14-21, 21-13, 10-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.