Lakshya Sen: స్వర్ణం సాధించిన లక్ష్యసేన్‌‌.. తుదిపోరులో విజయం

కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో భారత షట్లర్‌ లక్ష్యసేన్‌ విజయం సాధించాడు. దీంతో అతడు స్వర్ణంతో మెరిశాడు...

Updated : 15 Aug 2022 14:38 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో భారత షట్లర్‌ లక్ష్యసేన్‌ విజయం సాధించాడు. దీంతో అతడు స్వర్ణంతో మెరిశాడు. మలేషియాకు చెందిన జె యంగ్‌ ఎన్జీతో తలపడిన ఫైనల్స్‌లో లక్ష్యసేన్‌ 19-21, 21-9, 21-16 తేడాతో గెలుపొందాడు. తొలి గేమ్‌లో కాస్త వెనుకంజలో నిలిచిన లక్ష్యసేన్‌ చివరి రెండు గేమ్స్‌లోనూ పట్టుదలగా ఆడాడు. ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. దీంతో గొప్పగా పోరాడి భారత్‌కు మరో పసిడి అందించాడు. ఈ విజయంతో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 57 పతకాలు సాధించింది. అందులో 20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలు ఉన్నాయి. అంతకుముందు మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు