Lalit Modi: సుస్మితా సేన్‌తో కలిసి కొత్త జీవితం ప్రారంభించా: లలిత్‌ మోదీ

బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు భారత మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీ ప్రకటించారు. సుస్మితా సేన్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

Updated : 15 Jul 2022 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు భారత మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీ ప్రకటించారు. సుస్మితా సేన్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇటీవలే కుటుంబంతో కలిసి ప్రపంచ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో లలిత్‌ మోదీ స్పష్టత ఇస్తూ మరో ట్వీట్‌ చేశారు. ‘‘ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం కలిసి డేటింగ్‌ మాత్రమే చేస్తున్నాం. భవిష్యత్తులో పెళ్లి కూడా జరగవచ్చు’’ అని ట్వీట్‌ చేశారు. తనతో కలిసి ఉన్న ఫొటోలను పోస్టు చేశారు.

మాజీ విశ్వసుందరి అయిన సుస్మితా సేన్‌ గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు వాళ్లిద్దరూ కలిసి డేటింగ్‌ చేశారు. అయితే కొన్ని కారణాలతో వాళ్లిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్‌ చెప్పారు. మరోవైపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్‌ మోదీ 2010 నుంచి లండన్‌లో ఉంటున్నారు.
 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని