Shane Warne Photos : దివికేగిన బౌలింగ్‌ దిగ్గజం.. అరుదైన చిత్రాలు

 షేన్‌వార్న్‌... దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగి దివికేగిన ఆసీస్‌ మాజీ ఆటగాడికి...

Published : 05 Mar 2022 22:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: షేన్‌వార్న్‌.. పేరుకే ఆసీస్‌ ఆటగాడైనా తన విలక్షణమైన ఆటశైలితో భారత్‌లోనూ అభిమానులను కూడగట్టుకున్నాడు. క్రికెట్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు అటు క్రికెట్‌కు, ఇటు  అభిమానులను తీవ్ర విషాదంలోకి నెడుతూ లోకం విడిచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ దిగ్గజ ఆటగాడి అరుదైన చిత్రాలు మీకోసం..

తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లో ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న షేన్‌వార్న్‌. 2007 జనవరి 5న ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు మ్యాచ్‌ అనంతరం రిటైర్‌మెంట్ ప్రకటించాడు.


2019లో పోకర్‌ ప్రపంచ సిరీస్‌ తొలి రోజు ఆటలో షేన్‌వార్న్‌ పాల్గొన్నాడు. లాస్‌వెగాస్‌ వేదికగా జరిగింది. 


1999లో ఆసీస్‌ వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. ఆ జట్టులో షేన్‌వార్న్‌ సభ్యుడు. తొలిసారి ప్రపంచకప్‌తో షేన్‌ వార్న్‌


2005లో ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆటలో గారియంట్ జోన్స్‌ వికెట్‌ కోసం షేన్‌వార్న్‌ అప్పీలు చేశాడు. ఈ మ్యాచ్‌ లార్డ్స్‌ వేదికగా జరిగింది. 


క్రికెట్‌ వ్యాఖ్యాతగా షేన్ వార్న్‌


ఐపీఎల్‌(2008) తొలి సీజన్‌లోనే రాజస్థాన్‌ రాయల్స్‌కు టైటిల్‌ అందించాడు. కెప్టెన్‌గా ముందుండి నడిపించిన షేన్‌వార్న్‌ నాయకత్వంలోనే ఐపీఎల్‌ అరంగేట్ర కప్‌ ఆర్‌ఆర్‌ సొంతమైంది. 


ప్రముఖ నటి, మోడల్‌ ఎలిజెబెత్‌ హుర్లేతో షేన్‌వార్న్‌. కొంతకాలంపాటు వీరిద్దరూ డేటింగ్‌ చేశారు. అయితే రెండేళ్లకే ఆ బంధం ముగిసింది.


1999 ప్రపంచకప్‌లో తుదిపోరులో పాకిస్థాన్‌ ఆసీస్‌ ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సహచరులు మెక్‌గ్రాత్, స్టీవ్‌వా, గిల్‌క్రిస్ట్‌ సహా జట్టు సభ్యులతో షేన్‌వార్న్‌


ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ వికెట్‌తీసిన ఆనందంలో వార్న్‌. 2005లో బ్రిట్‌ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఫ్లింటాఫ్‌ను షేన్‌వార్న్‌ బోల్తా కొట్టించాడు. 


తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లో ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న షేన్‌వార్న్‌. 2007 జనవరి 5న ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు మ్యాచ్‌ అనంతరం రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని